Telugu Global
Others

హైకోర్టు కోసం.. ఇక అమీతుమీ!

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండేళ్లు పూర్త‌యినా.. హైకోర్టు విభ‌జ‌న‌లో జ‌రుగుతున్న జాప్యంపై తెలంగాణ న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తులు ఆందోళ‌న బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. వీరంతా హైకోర్టు నియ‌మాల‌కు విరుద్ధంగా ఆందోళ‌న‌లు చేస్తుండ‌టంతో కోర్టు వీరిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తెలంగాణ‌కు కేటాయించిన న్యాయాధికారుల విష‌యంలో తెలంగాణ న్యాయాధికారుల సంఘం అభ్యంర‌తం తెలుపుతూ కొన్నిరోజులుగా ఆందోళ‌న బాట‌ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వీరి ఆందోళ‌న నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మని హైకోర్టు వీరిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తెలంగాణ న్యాయాధికారుల […]

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండేళ్లు పూర్త‌యినా.. హైకోర్టు విభ‌జ‌న‌లో జ‌రుగుతున్న జాప్యంపై తెలంగాణ న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తులు ఆందోళ‌న బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. వీరంతా హైకోర్టు నియ‌మాల‌కు విరుద్ధంగా ఆందోళ‌న‌లు చేస్తుండ‌టంతో కోర్టు వీరిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తెలంగాణ‌కు కేటాయించిన న్యాయాధికారుల విష‌యంలో తెలంగాణ న్యాయాధికారుల సంఘం అభ్యంర‌తం తెలుపుతూ కొన్నిరోజులుగా ఆందోళ‌న బాట‌ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వీరి ఆందోళ‌న నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మని హైకోర్టు వీరిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శిల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. దీంతో న్యాయాధికారుల‌కు మ‌ద్ద‌తుతా తెలంగాణ న్యాయ‌వాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ వ‌చ్చినా.. కూడా హైకోర్టు విభ‌జ‌న‌, తెలంగాణ‌కు ఆంధ్ర‌ప్రాంత న్యాయాధికారులు కేటాయించ‌డ‌మే కాకుండా..మాపై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తారా? అంటూ న్యాయవాది లోకం మండిప‌డింది నేటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టుల‌కు సామూహిక సెల‌వులు పెట్టాల‌ని తెలంగాణ న్యాయాధికారుల సంఘం నిర్ణ‌యింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ర‌కాల కోర్టు విచార‌ణ‌ల‌కు తీవ్ర ఆటంకం క‌ల‌గ‌నుంది.

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష‌!

తెలంగాణ న్యాయాధికారుల పోరాటం, హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో కేంద్రం చేస్తోన్న తీవ్ర జాప్యం వెర‌సి ఈవిష‌యంలో తెలంగాణ స‌ర్కారు క‌ల‌గ‌జేసుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఇక ప‌రిస్థితి చేయి జారిపోయే స్థితికి చేరుకోవ‌డంతో.. సీఎం కేసీఆర్ తానే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విషయంలో కేంద్రం తీరును ఎండ‌గ‌ట్టేందుకు తానే ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. రాష్ర్టానికి జ‌రుగుతున్న అన్యాయంపై దేశ‌రాజ‌ధానిలోనే కేంద్రాన్ని నిల‌దీయాల‌న్న‌ది ఆయ‌న వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేంద్రానికి ప‌లుమార్లు ఈ విషయాన్ని త్వ‌ర‌గా తేల్చాల‌ని కోరారు సీఎం కేసీఆర్‌. అవ‌స‌ర‌మైతే.. ఏపీ హైకోర్టును ఇక్క‌డే పెట్టుకోండ‌ని, స్థ‌లం, భ‌వ‌నాలు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డానికి తాము సిద్ధంగానే ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. అయినా.. అటు కేంద్రం నుంచి ఇటు ఏపీ నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ప్ర‌తి పార్ల‌మెంటు స‌మావేశంలో టీఆర్ ఎస్ ఎంపీలు ఇదే ప్ర‌శ్న వేయ‌డం.. కేంద్రం దాన్ని దాట‌వేయ‌డం ష‌రామామూలైపోయింది. ఇప్పుడు ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేయ‌బోయే దీక్ష‌తో హైకోర్టు విభ‌జ‌న‌కు ఎవ‌రైనా అడ్డుప‌డుతున్నారా? లేక ఇదంతా కేవ‌లం సాంకేతిక జాప్యమేనా? అన్న‌ది తేలిపోనుంది.

Click on Image to Read:

ap-minister

c-kalyan-comments

mohan-babu

paritala-sunitha-prabhakar-

ys-jagan

shabbir-ali-ys-jagan

jagan-swarupananda-swami

chandrababu-school

babu china tour

high-court

Quthbullapur-MLA-Vivekanada

back-caste-go

pawan

hyd court 1

dk-aruna

gottipati

devineni-uma-jogi-ramesh

brahmin-swis

First Published:  27 Jun 2016 9:29 PM GMT
Next Story