Telugu Global
International

మ‌నుషుల‌తో విసిగి.. బొమ్మ‌తో స‌హ‌జీవ‌నం..!

మ‌నుషులంటే విర‌క్తి క‌లిగిందో.. లేక సంసార జీవితంపై ఆస‌క్తి స‌న్న‌గిల్లిందో కానీ.. బొమ్మే న‌య‌మ‌నుకున్నాడు ఓ వృద్ధుడు. తోడు కావాల్సిన ఈ వయ‌సులో త‌న‌కు తోడుగా ఓ ఆడ‌బొమ్మ‌ను తెచ్చుకున్నాడు. దానితోనే స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. దానికి ఉద‌యాన్నే స్నానం చేయించ‌డం, త‌ల‌దువ్వ‌డం, దుస్తులు మార్చ‌డం ఈ ప‌నుల‌న్నీ తానే స్వ‌యంగా చేస్తాడు. ఇంత‌కీ అత‌డెవ‌ర‌నా?  మీ ప్ర‌శ్న‌? అత‌నిపేరు సెంజీ నకాజిమా జ‌పాన్‌కు చెందిన‌ వ్యాపారి. ఈయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కాపురంలో క‌ల‌హాలు రేగి […]

మ‌నుషుల‌తో విసిగి.. బొమ్మ‌తో స‌హ‌జీవ‌నం..!
X
మ‌నుషులంటే విర‌క్తి క‌లిగిందో.. లేక సంసార జీవితంపై ఆస‌క్తి స‌న్న‌గిల్లిందో కానీ.. బొమ్మే న‌య‌మ‌నుకున్నాడు ఓ వృద్ధుడు. తోడు కావాల్సిన ఈ వయ‌సులో త‌న‌కు తోడుగా ఓ ఆడ‌బొమ్మ‌ను తెచ్చుకున్నాడు. దానితోనే స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. దానికి ఉద‌యాన్నే స్నానం చేయించ‌డం, త‌ల‌దువ్వ‌డం, దుస్తులు మార్చ‌డం ఈ ప‌నుల‌న్నీ తానే స్వ‌యంగా చేస్తాడు. ఇంత‌కీ అత‌డెవ‌ర‌నా? మీ ప్ర‌శ్న‌? అత‌నిపేరు సెంజీ నకాజిమా జ‌పాన్‌కు చెందిన‌ వ్యాపారి. ఈయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కాపురంలో క‌ల‌హాలు రేగి కొంత‌కాలం క్రితం విడిపోయారు.
foll2దీంతో కొంత‌కాలం ఒంటరిగా ఉన్న సెంజీకి తోడు కావాలనిపించింది. అందుకే, ఈసారి మ‌నుషుల‌ను కాకుండా ల‌వ్ డాల్‌ను తెచ్చుకున్నాడు. దాంతోనే స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. భ‌లే ఉంది క‌దూ.. మ‌నం చెప్పింది విన‌డ‌మే త‌ప్ప తిరిగి స్పందించ‌ని ఈ బొమ్మ‌తో ఎలాంటి త‌ల‌నొప్పులు ఉండ‌వంటున్నాడు. నాకు తోడులేని వెలితి తీరింది. ప్ర‌తి చిన్న విష‌యానికి సంజాయిషీ ఇచ్చుకునే బాధ త‌ప్పింది అంటున్నాడు సెంజీ. భ‌లే ఉంది క‌దూ బొమ్మ ఐడియా!
First Published:  27 Jun 2016 10:08 PM GMT
Next Story