ఇక సోషల్‌మీడియాలో...ఆ హింస ఉండదు!
ఉగ్రవాద సంస్థలు చేసే పోస్టులు, వీడియోలు యూజర్ల వరకు రాకుండా ఆటోమేటిక్గా ఆగిపోయేలా సోషల్ మీడియా వెబ్‌సైట్లు చర్యలు తీసుకుంటున్నాయి. ఐఎస్ ఉగ్రవాదులు పోస్ట్ చేసే దారుణమైన, బీభత్సకరమైన వీడియోలు, హింసను రెచ్చగొట్టే పోస్టులు సోషల్‌మీడియాలో తరచుగా ప్రత్యక్షమై భయోత్పాతాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాజీని రూపొందించారు. యూట్యూబ్, ఫేస్బుక్ ఇప్పుడు అలాంటి వీడియోలను తొలగించే పనిలో ఉన్నాయి. అమెరికాతో పాటు అనేక దేశాలు యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ తదితర […]

ఉగ్రవాద సంస్థలు చేసే పోస్టులు, వీడియోలు యూజర్ల వరకు రాకుండా ఆటోమేటిక్గా ఆగిపోయేలా సోషల్ మీడియా వెబ్‌సైట్లు చర్యలు తీసుకుంటున్నాయి. ఐఎస్ ఉగ్రవాదులు పోస్ట్ చేసే దారుణమైన, బీభత్సకరమైన వీడియోలు, హింసను రెచ్చగొట్టే పోస్టులు సోషల్‌మీడియాలో తరచుగా ప్రత్యక్షమై భయోత్పాతాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాజీని రూపొందించారు. యూట్యూబ్, ఫేస్బుక్ ఇప్పుడు అలాంటి వీడియోలను తొలగించే పనిలో ఉన్నాయి.
అమెరికాతో పాటు అనేక దేశాలు యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ తదితర సంస్థలపై ఈ నిషేధం గురించి కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాయి. దాంతో అలాంటి పోస్టులు ఆటోమేటిక్గా తొలగిపోయేలా టెక్నాలజీని రూపొందించారు. కాపీరైట్ రక్షణ ఉన్న వీడియోలను గుర్తించి తొలగించేందుకు రూపొందించిన టెక్నాలజీ విధానాన్ని, హింసాత్మక వీడియోలు పోస్టుల తొలగింపుకి కూడా పనికొచ్చేలా వినియోగించనున్నారు.