Telugu Global
Cinema & Entertainment

నానిపై ప్రేమను అలా చాటుకున్న హీరోయిన్

జెంటిల్ మన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేద థామస్… సింగిల్ సినిమాతో టాలీవుడ్ వండర్ అయిపోయింది. జెంటిల్ మన్ లో నాని గురించి జనాలు ఎంతగా మాట్లాడుకుంటున్నారో… సేమ్ టైం నివేది అందం, అభినయం గురించి కూడా అంతలా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఆమెకు ఎన్టీఆర్ కూడా ఓ ఛాన్స్ ఇస్తాడని తెలుస్తోంది. తెలుగు నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన నానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నివేదాకు అర్థంకాలేదు. అందుకే కాస్త […]

నానిపై ప్రేమను అలా చాటుకున్న హీరోయిన్
X
జెంటిల్ మన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేద థామస్… సింగిల్ సినిమాతో టాలీవుడ్ వండర్ అయిపోయింది. జెంటిల్ మన్ లో నాని గురించి జనాలు ఎంతగా మాట్లాడుకుంటున్నారో… సేమ్ టైం నివేది అందం, అభినయం గురించి కూడా అంతలా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఆమెకు ఎన్టీఆర్ కూడా ఓ ఛాన్స్ ఇస్తాడని తెలుస్తోంది. తెలుగు నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన నానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నివేదాకు అర్థంకాలేదు. అందుకే కాస్త వెరైటీగా ఆలోచించి ఇలా థ్యాంక్స్ చెప్పుకుంది. కేవలం నటిగానే కాకుండా…మంచి ఆర్టిస్ట్ అని నిరూపించుకుంది. జెంటిల్మన్ లో నాని పాత్రలను తెలిపేలా ఇలా ఓ బొమ్మ గీసింది నివేద. ఆ పెయింటింగ్ ను నానికి గిఫ్ట్ గా అందజేసింది. ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని, ఊహించని విధంగా వచ్చిన బహుమతి చూసి నాని థ్రిల్ ఫీలయ్యాడు. వెంటనే ఆ పెయింటింగ్ ను ట్విట్టర్ లో పెట్టాడు. తనకు నివేది ఇచ్చిన గిఫ్ట్ ఇదేనంటూ ట్వీట్ చేశాడు. దీనికి నివేద కూడా రీట్వీట్ చేసింది. గిఫ్ట్ నచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఆ ఫొటో ఇదే….
First Published:  26 Jun 2016 10:47 PM GMT
Next Story