మనం తింటున్న ఫుడ్‌లో 35 శాతం...విదేశీయమే!
మనకు పేర్లు కూడా తెలియని పళ్లు, కూరగాయలు ఇప్పుడు మన మార్కెట్లలో ప్రత్యక్షమవుతున్నాయి. అవన్నీ ఇక్కడికి కావు…విదేశాల నుండి వచ్చినవే. మనకు తెలియనివే కాదు, బాగా తెలిసిన బంగాళ దుంప, ఉల్లిపాయలు, టమాటా, మిర్చి సైతం మనవి కాదని, ఇతరదేశాలనుండే వచ్చాయని ఒక నివేదిక పేర్కొంది. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్ అనే సంస్థ 177 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారత్‌లో వాడుతున్న చెట్లద్వారా వచ్చిన ఆహారంలో… మూడోవంతుకంటే ఎక్కువభాగం విదేశాల […]
మనకు పేర్లు కూడా తెలియని పళ్లు, కూరగాయలు ఇప్పుడు మన మార్కెట్లలో ప్రత్యక్షమవుతున్నాయి. అవన్నీ ఇక్కడికి కావు…విదేశాల నుండి వచ్చినవే. మనకు తెలియనివే కాదు, బాగా తెలిసిన బంగాళ దుంప, ఉల్లిపాయలు, టమాటా, మిర్చి సైతం మనవి కాదని, ఇతరదేశాలనుండే వచ్చాయని ఒక నివేదిక పేర్కొంది. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్ అనే సంస్థ 177 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారత్‌లో వాడుతున్న చెట్లద్వారా వచ్చిన ఆహారంలో… మూడోవంతుకంటే ఎక్కువభాగం విదేశాల నుండి వచ్చిందేనని ఈ నివేదిక పేర్కొంది.
శతాబ్దాల క్రితం అవన్నీ వ్యాపారం ద్వారానో, ప్రజా వలసల ద్వారానో ఇండియా చేరాయని ఈ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ఉల్లిపాయలు, గోధుమ పశ్చిమ ఆసియా దేశాల నుండి, బంగాళ దుంప, టమాట దక్షిణ అమెరికా నుండి, మెంతులు మధ్యధరా సముద్ర తీర దేశాల నుండి, మిరపకాయలు మధ్య అమెరికా ప్రాంతాల నుండి, వెల్లుల్లి, యాపిల్స్ మధ్య ఆసియా దేశాల నుండి భారత్కి వచ్చినట్టుగా తెలుస్తోంది.