Telugu Global
Cinema & Entertainment

దీపిక అన్ని గాసిప్స్ కు సమాధానం చెప్పేసింది

బాలీవుడ్ లో ఒక అగ్ర తార‌గా కొన సాగుతున్న దీపిక ప‌దుకోణ్…. స‌డ‌న్ గా ఒక హాలీవుడ్ చిత్రంలో లీడ్ రోల్ ఆఫ‌ర్ రావడంతో…. కొంత కాలం పాటు షూటింగ్ నిమిత్తం పూర్తిగా హాలీవుడ్ లోనే ఉండిపోవ‌డంతో అందరు దీపిక ఇక బాలీవుడ్ కు దూరమైనట్లే అనే వదంతులు వినిపించాయి. అయితే దీపిక ట్రిప్లెక్స్ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ముంబాయికి తిరిగి వ‌చ్చింది. ఈ సందర్భంగా మీడియాను అడ్ర‌స్ చేస్తు త‌న మీద వ‌చ్చిన రూమ‌ర్స్ […]

దీపిక అన్ని గాసిప్స్ కు సమాధానం చెప్పేసింది
X

బాలీవుడ్ లో ఒక అగ్ర తార‌గా కొన సాగుతున్న దీపిక ప‌దుకోణ్…. స‌డ‌న్ గా ఒక హాలీవుడ్ చిత్రంలో లీడ్ రోల్ ఆఫ‌ర్ రావడంతో…. కొంత కాలం పాటు షూటింగ్ నిమిత్తం పూర్తిగా హాలీవుడ్ లోనే ఉండిపోవ‌డంతో అందరు దీపిక ఇక బాలీవుడ్ కు దూరమైనట్లే అనే వదంతులు వినిపించాయి. అయితే దీపిక ట్రిప్లెక్స్ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ముంబాయికి తిరిగి వ‌చ్చింది.

ఈ సందర్భంగా మీడియాను అడ్ర‌స్ చేస్తు త‌న మీద వ‌చ్చిన రూమ‌ర్స్ కు క్లారీటి ఇచ్చింది. త‌ను పూర్తిగా బాలీవుడ్ కు దూర‌మైన‌ట్లు అనేది నిజం కాదు.. హాలీవుడ్ కు వెళ్ల‌డం అనేది ఒక విహార యాత్ర లాంటిదే త‌ప్ప‌.. అది పర్మినెంట్ ప్లేస్ కాద‌ని తేల్చింది. ఇక ర‌ణ‌వీర్ సింగ్ గురించి స్పందిస్తూ.. అత‌ను ఎప్పుడు త లైఫ్ లో ఒక ముఖ్య‌మైన ఎలిమేంటేన‌ని తేల్చి చెప్పింది. టెన్నిస్ ప్లేయ‌ర్ నొవాక్ జొకోవిచ్ ను లాస్ ఎంజిల్స్ క‌ల‌వ‌డం అనేది జ‌స్ట్ త‌ను కూడా క్రీడా కారుల ఫ్యామిలీ నుంచి రావ‌డం వ‌ల‌న .. త‌న‌కు వారి పై వుండే ప్ర‌త్యేక అభిమానం ఉండి… అందులో భాగంగానే క‌లిసిన‌ట్లు తెలిపింది. చివ‌రిగా కొత్త స‌వాళ్ ను ఎదుర్కొంటు ముంద‌కు వెళ్ల‌డం పైనే కెరీర్ ఆధార ప‌డి వుంటుంద‌ని దీపిక ప‌దుకోణ్ తెలిపింది.

First Published:  24 Jun 2016 10:19 PM GMT
Next Story