Telugu Global
Cinema & Entertainment

అందరివాడు సినిమాలో అందరూ ఉంటారట...

ఎట్టకేలకు 150వ సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు చిరంజీవి. కంప్లీట్ మేకోవర్ తో అదరగొట్టాడు. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న టైమ్ లో పండగ లాంటి మరో వార్త కూడా చెప్పాడు. త్వరలోనే తన సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల చేస్తానని ప్రకటించి మెగాభిమానుల్లో ఆనందం నింపాడు. ఇదిలా ఉండగా… తన 150వ సినిమాకు సంబంధించి మరో కొత్త ప్లానింగ్ తో మనముందుకొస్తున్నాడు చిరంజీవి. 150వ సినిమాలో మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలంతా కనిపించే అవకాశముందని […]

అందరివాడు సినిమాలో అందరూ ఉంటారట...
X
ఎట్టకేలకు 150వ సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు చిరంజీవి. కంప్లీట్ మేకోవర్ తో అదరగొట్టాడు. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న టైమ్ లో పండగ లాంటి మరో వార్త కూడా చెప్పాడు. త్వరలోనే తన సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల చేస్తానని ప్రకటించి మెగాభిమానుల్లో ఆనందం నింపాడు. ఇదిలా ఉండగా… తన 150వ సినిమాకు సంబంధించి మరో కొత్త ప్లానింగ్ తో మనముందుకొస్తున్నాడు చిరంజీవి. 150వ సినిమాలో మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలంతా కనిపించే అవకాశముందని గతంలో వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం… ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలంతా చిరు 150వ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు వీవీ వినాయక్ కన్ ఫర్మ్ చేశాడు. చిరంజీవి మైల్ స్టోన్ మూవీని మరింత స్పెషల్ గా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపిన వినాయక్… తమ సినిమాలో ఎవరెవరు కనిపిస్తారో త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టంచేశాడు. చిరంజీవి, అలీ పాల్గొనగా టాకీ పార్టుకు సంబంధించిన సన్నివేశాల్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ వచ్చే నెల 12వరకూ హైదరాబాద్‌ పరిసరాల్లో జరుగుతుంది. ఆ తర్వాత చేయబోయే షెడ్యూల్‌ భారీ గా ఉండబోతోంది. ఈ భారీ షెడ్యూల్లోనే హీరోయిన్‌ ఎంటర్‌ అవుతుంది. అప్పటివరకు హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్.
First Published:  24 Jun 2016 8:31 PM GMT
Next Story