Telugu Global
Cinema & Entertainment

త‌మ‌న్నా కొత్త క‌హానీ..!

అనుభ‌వాలు ఎన్నో నేర్పుతాయి. సినిమా రంగం అనే కాదు. ఏ రంగంలో వారికైన ఇది సహజమే. ఇక సినిమా రంగం అయితే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ కు ఎన్నో ఒత్తిడిలుంటాయి. బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తారు. ల‌క్కీ గా స్టార్ డ‌మ్ వ‌స్తే.. నిలుపుకోవ‌డానికి నిరంతంరం శ్ర‌మించాలి. కొద్ది పాటి స్క్రీన్ స్పెస్ లో అభిమానుల్ని మెప్పించాలి. ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని, హీరోల తో సత్సంబంధాలు నెర‌పాలి. ఇలా చాలా ర‌కాల ప్రెజ‌ర్స్ ఉంటుంటాయి. వీట‌న్నింటిని మేనేజ్ […]

త‌మ‌న్నా కొత్త క‌హానీ..!
X

అనుభ‌వాలు ఎన్నో నేర్పుతాయి. సినిమా రంగం అనే కాదు. ఏ రంగంలో వారికైన ఇది సహజమే. ఇక సినిమా రంగం అయితే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ కు ఎన్నో ఒత్తిడిలుంటాయి. బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తారు. ల‌క్కీ గా స్టార్ డ‌మ్ వ‌స్తే.. నిలుపుకోవ‌డానికి నిరంతంరం శ్ర‌మించాలి. కొద్ది పాటి స్క్రీన్ స్పెస్ లో అభిమానుల్ని మెప్పించాలి. ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని, హీరోల తో సత్సంబంధాలు నెర‌పాలి. ఇలా చాలా ర‌కాల ప్రెజ‌ర్స్ ఉంటుంటాయి. వీట‌న్నింటిని మేనేజ్ చేసే ద‌శ‌లో ప్రతి ఒక్క‌రికి ఎంతో ప‌రిణితి తెలియ‌కుండానే అల‌వాడుతుంది. అలా ఒక ప‌రిణితి వ‌చ్చిన త‌ర‌వాత మాట్లాడే మాట‌లు ఒక్కోసారి వేదాంతం కూడా ఉంటుంది. తాజాగా గ్లామ‌ర్ బ్యూటీ త‌మ‌న్నా అలాగే చెప్పింది మ‌రి.

సినిమా ఇండ‌స్ట్రీలో ఆర్టిస్ట్ ల జీవితాన్ని ఫెయిల్యూర్ బాగా ప్ర‌భావితం చేస్తుంది. ఒక స‌క్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన‌ట్లే.. ఫెయిల్యూర్ తో అట్ట‌డుకు వెళ్లిపోయే సంద‌ర్భాలుంటాయి. త‌మ‌న్నా మాత్రం త‌న కెరీర్ లో ఒట‌మి వ‌చ్చిన‌ప్పుడు త‌న‌ను తాను బ్యాలెన్స్ చేసుకోవ‌డంలో స‌ఫ‌ల‌మైన‌ట్లు తెలిపింది. ఏదైనా ముందే రాసి పెట్టి వుంటుంది. దాని ప్ర‌కార‌మే అంతా న‌డుస్తుందిని ఒక వేదంత‌పు మాట చెప్పుకొచ్చింది. త‌ను ఫెయిల్యూర్ లో వున్న‌ప్పుడు.. రాజ‌మౌళి సార్ ఫోన్ చేసి బాహుబ‌లి లో న‌టించ‌మ‌ని కాల్ చేశారు. ఇది నిజంగా ల‌క్క్ కాక పోతే ఏమిటి..? సో త‌మ‌న్నా ప్ర‌స్తుతం త‌న జీవితంలో జ‌రిగేవ‌న్నీ ఒక విధ‌మైన వేదాంత ధోర‌ణి లో రిసీవ్ చేసుకుంటుంది అన్న‌మాట‌.

First Published:  24 Jun 2016 12:45 AM GMT
Next Story