Telugu Global
Cinema & Entertainment

ఈసారికి అలా నెట్టుకరావడానికి ప్రయత్నిస్తున్న సొనాక్షి

దబాంగ్ చిత్రంతో ప‌రిచ‌య‌మైన సోనాక్షి ..ఈ చిత్రం హిట్ కావ‌డంతో వ‌ర‌స‌గా ప‌లుచిత్రాలు చేసింది. గ్లామర్ హీరో్యిన్ అనిపించుకుంది. క‌ట్ చే్స్తే.. మౌస‌మ్ చిత్రం నుంచి వ‌ర‌స‌గా మూడు చిత్రాలు ఫెయిల్ కావ‌డంతో సీన్ రివ‌ర్స్ అయ్యింది. ద‌క్షిణాదిన ర‌జ‌నీకాంత్ తో చేసిన లింగ చిత్రం త‌న‌కు మంచి బూస్ట్ ఇస్తుంది అనుకుంటే అది కూడా పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. దీంతో సోనాక్షి ప‌ని అయిపోయింది అనుకున్నారు. కానీ న‌టిగా ప‌ది కాలాల పాటు ఇండ‌స్ట్రీలో వుంటే […]

ఈసారికి అలా నెట్టుకరావడానికి ప్రయత్నిస్తున్న సొనాక్షి
X

దబాంగ్ చిత్రంతో ప‌రిచ‌య‌మైన సోనాక్షి ..ఈ చిత్రం హిట్ కావ‌డంతో వ‌ర‌స‌గా ప‌లుచిత్రాలు చేసింది. గ్లామర్ హీరో్యిన్ అనిపించుకుంది. క‌ట్ చే్స్తే.. మౌస‌మ్ చిత్రం నుంచి వ‌ర‌స‌గా మూడు చిత్రాలు ఫెయిల్ కావ‌డంతో సీన్ రివ‌ర్స్ అయ్యింది. ద‌క్షిణాదిన ర‌జ‌నీకాంత్ తో చేసిన లింగ చిత్రం త‌న‌కు మంచి బూస్ట్ ఇస్తుంది అనుకుంటే అది కూడా పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. దీంతో సోనాక్షి ప‌ని అయిపోయింది అనుకున్నారు.

కానీ న‌టిగా ప‌ది కాలాల పాటు ఇండ‌స్ట్రీలో వుంటే కేవ‌లం గ్లామ‌ర‌నే న‌మ్మ‌కుంటే లాభం లేద‌నే విష‌యం గ్ర‌హించింది.దీంతో క‌థా బ‌లం వున్న చిత్రాల‌పై దృష్టి పెట్టింది. అలా కుదిరిన స‌బ్జ‌క్టే ముర‌గ‌దాస్ తో చేస్తున్న అకీరా చిత్రం.2011 లో త‌మిళ్ లో వ‌చ్చిన మౌన గురు చిత్రం రీమేక్ గా హిందిలో అకీరా పేరు తో ఈ చిత్రం వ‌స్తుంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సోనాక్షి తండ్రి , శ‌త్రుఘ్న సిన్హా, కోంక‌ణ సేన్ , వూర్మిళ మోహంత లు న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న అకీరా చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్దం అవుతుంది.

First Published:  21 Jun 2016 3:19 AM GMT
Next Story