ఆ తండ్రి ప్రాణం ఖరీదు...70 వేలు!
తండ్రీ కొడుకుల మధ్య చెలరేగిన డబ్బు వివాదం చివరికి కొడుకు తండ్రిని చంపడానికి దారితీసింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గవ్వల శంకర్ (45)కి, అతని పెద్ద కుమారుడు సిద్దార్థ్‌తో డబ్బు విషయంలో మూడునెలలుగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషులు రాజీ కుదర్చాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో సోమవారం సిద్దార్థ్ రోకలిబండతో తండ్రిమీద దాడి చేశాడు. గట్టిగా బాదుతూ కాలుని విరగ్గొట్టాడు. ఇంకా కోపం చల్లారక ఇష్టం […]
తండ్రీ కొడుకుల మధ్య చెలరేగిన డబ్బు వివాదం చివరికి కొడుకు తండ్రిని చంపడానికి దారితీసింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గవ్వల శంకర్ (45)కి, అతని పెద్ద కుమారుడు సిద్దార్థ్‌తో డబ్బు విషయంలో మూడునెలలుగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషులు రాజీ కుదర్చాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో సోమవారం సిద్దార్థ్ రోకలిబండతో తండ్రిమీద దాడి చేశాడు. గట్టిగా బాదుతూ కాలుని విరగ్గొట్టాడు. ఇంకా కోపం చల్లారక ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. దాంతో శంకర్ అక్కడికక్కడే మరణించాడు. గత ఏడాది వరిధాన్యం అమ్మగా వచ్చిన 70వేల రూపాయిల విషయంలో వీరిద్దరికీ గొడవ మొదలైనట్టుగా చుట్టుపక్కలవారు వెల్లడించారు. గొడవతో సంబంధం ఉన్న కారణంగా మృతుడి భార్య సుశీల, చిన్న కొడుకు నరేందర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.