Telugu Global
Cinema & Entertainment

త్వరలోనే పాటలు పాడనున్న జక్కన్న

ఇప్పటికే టీజర్ తో హల్ చల్ చేశాడు జక్కన్న. సునీల్ హీరోగా నటించిన కొత్త సినిమా పేరిది. నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా అంటూ కమెడియన్ సప్తగిరి అడిగితే… అంతే ఫాస్ట్ గా నీకు గీతా ఆర్ట్స్ తెలుసా అంటూ సునీల్ అమాయకంగా చమత్కరిస్తాడు. ఈ టీజర్ ఇనిస్టెంట్ గా హిట్టయింది. టీజర్ ఇచ్చిన కొత్త ఎనర్జీతో వీలైనంత త్వరగా ఆడియోను కూడా విడుదల చేయాలని జక్కన్న యూనిట్ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 24న […]

త్వరలోనే పాటలు పాడనున్న జక్కన్న
X
ఇప్పటికే టీజర్ తో హల్ చల్ చేశాడు జక్కన్న. సునీల్ హీరోగా నటించిన కొత్త సినిమా పేరిది. నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా అంటూ కమెడియన్ సప్తగిరి అడిగితే… అంతే ఫాస్ట్ గా నీకు గీతా ఆర్ట్స్ తెలుసా అంటూ సునీల్ అమాయకంగా చమత్కరిస్తాడు. ఈ టీజర్ ఇనిస్టెంట్ గా హిట్టయింది. టీజర్ ఇచ్చిన కొత్త ఎనర్జీతో వీలైనంత త్వరగా ఆడియోను కూడా విడుదల చేయాలని జక్కన్న యూనిట్ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 24న జక్కన్న పాటలు మార్కెట్లోకి విడుదలవుతాయి. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రేమకథాచిత్రం లాంటి హిట్ సినిమాను నిర్మించిన నిర్మాతలే జక్కన్నను కూడా ప్రొడ్యూస్ చేశారు. సునీల్ గతచిత్రం కృష్ణాష్టమికి సంగీతం అందించిన దినేష్… తాజా చిత్రం జక్కన్నకు కూడా స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి మన్నారా చోప్రా తెలుగుతెరకు పరిచయం అవుతోంది. ఈమె ప్రియాంకా చోప్రాకు వరసకు చెల్లెలు కావడం విశేషం. వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న సునీల్… జక్కన్నతోనైనా హిట్ బాట పట్టాలని కోరుకుందాం. అన్నట్టు ఈ సినిమా కథ రెగ్యులర్ స్టోరీలా కాకుండా.. జనాలందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా, కామిక్ గా, అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. సినిమా హిట్టయితే దానికి కారణం స్టోరీనే అవుతుందని నమ్మకంతో ఉన్నారు.
First Published:  20 Jun 2016 7:47 AM GMT
Next Story