Telugu Global
Cinema & Entertainment

మరోసారి జగ్గూతో పూరీ

కెరీర్ స్టార్టింగ్ లో ఎప్పుడో జగపతిబాబుతో కలిసి ఓ సినిమా చేశాడు పూరి జగన్నాధ్. బాచి అనే సినిమా వచ్చింది వీళ్లిద్దరి కాంబినేషన్ లో. తర్వాత పూరి జగన్నాధ్ దర్శకుడిగా బిజీ అయిపోయాడు. ఎన్నో హిట్ సినిమాలు అందుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు జగపతిబాబును తన ప్రాజెక్టులోకి తీసుకున్నాడు పూరి జగన్నాధ్. కళ్యాణ్ రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే . ఇప్పుడు ఆ చిత్రం లో జగపతి బాబు కూడా […]

మరోసారి జగ్గూతో పూరీ
X
కెరీర్ స్టార్టింగ్ లో ఎప్పుడో జగపతిబాబుతో కలిసి ఓ సినిమా చేశాడు పూరి జగన్నాధ్. బాచి అనే సినిమా వచ్చింది వీళ్లిద్దరి కాంబినేషన్ లో. తర్వాత పూరి జగన్నాధ్ దర్శకుడిగా బిజీ అయిపోయాడు. ఎన్నో హిట్ సినిమాలు అందుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు జగపతిబాబును తన ప్రాజెక్టులోకి తీసుకున్నాడు పూరి జగన్నాధ్. కళ్యాణ్ రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే . ఇప్పుడు ఆ చిత్రం లో జగపతి బాబు కూడా కనిపించనున్నాడు. హీరో గా రిటైర్ అయ్యి జగపతి బాబు విలన్‌గా ఎంట్రీ ఇచ్చి పేరు తెచ్చుకున్నాడు. కల్యాణ్ రామ్ సినిమాలో కూడా విలన్ గానే కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలతోనూ బిజీగా ఉన్న జగపతి,కళ్యాణ్ రామ్‌ సినిమా కోసం మరోమారు పూరితో జతకట్టారు. అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు పూరి సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. జగ్గూ భాయ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందంటూ ఓ ఫొటో కూడా విడుదల చేశాడు.
First Published:  19 Jun 2016 9:51 AM GMT
Next Story