ఆ నాలుగు టైర్లు... కేవలం నాలుగు కోట్లు!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాలుగు టైర్లు నాలుగు కోట్ల రూపాయిల ధర పలికాయి. దుబాయికి చెందిన ఎన్నారై కంపెనీ జడ్ టైర్స్ వీటిని తయారుచేసింది. 24 కేరట్ల బంగారం, ప్రత్యేకమైన డైమండ్లను పొదిగి రూపొందించిన ఈ టైర్లు అత్యంత ఖరీదైన టైర్లుగా గిన్నిస్ బుక్లోకి ఎక్కాయి. ఇటలీ ఆభరణాల నిపుణులు వీటి తయారీలో పాల్గొన్నారని, అబుదాబీలో అధ్యక్ష భవనానికి పనిచేసిన కళాకారులు వీటిని డిజైన్ చేశారని జడ్ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ టైర్లను అమ్మడం […]

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాలుగు టైర్లు నాలుగు కోట్ల రూపాయిల ధర పలికాయి. దుబాయికి చెందిన ఎన్నారై కంపెనీ జడ్ టైర్స్ వీటిని తయారుచేసింది. 24 కేరట్ల బంగారం, ప్రత్యేకమైన డైమండ్లను పొదిగి రూపొందించిన ఈ టైర్లు అత్యంత ఖరీదైన టైర్లుగా గిన్నిస్ బుక్లోకి ఎక్కాయి. ఇటలీ ఆభరణాల నిపుణులు వీటి తయారీలో పాల్గొన్నారని, అబుదాబీలో అధ్యక్ష భవనానికి పనిచేసిన కళాకారులు వీటిని డిజైన్ చేశారని జడ్ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఈ టైర్లను అమ్మడం ద్వారా వచ్చిన లాభాలను తమ జినైసెస్ ఫౌండేషన్కి విరాళంగా ఇవ్వనున్నట్టుగా జడ్ టైర్స్ కంపెనీ తెలిపింది. రంజాన్ పర్వదినాల్లో విరాళాలు, దానాలకున్న ప్రాధాన్యత స్ఫూర్తితో ఈ పనిచేసినట్టుగా జినైసెస్ సిఇఓ హర్వీజ్ కాంధారీ తెలిపాడు. జినైసెస్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది.
Click on Image to Read: