Telugu Global
Cinema & Entertainment

మరోసారి మల్లూ మార్క్ చూపించిన బన్నీ

కేరళలో అల్లు అర్జున్ కు మల్లు అర్జున్ అన్న పేరు ఉన్న సంగతి తెలిసిందే . బన్నీ కి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండటంతో అల్లు అర్జున్ నటించిన ప్రతీ చిత్రాన్ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు . ఇటీవల తెలుగులో విజయం సాధించిన ”సరైనోడు ” చిత్రాన్ని మలయాళంలో ”యోధవు ” అనే పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . మలయాళంలో యోధవు భారీ వసూళ్ళ ని సాధిస్తూ రెండు […]

మరోసారి మల్లూ మార్క్ చూపించిన బన్నీ
X
కేరళలో అల్లు అర్జున్ కు మల్లు అర్జున్ అన్న పేరు ఉన్న సంగతి తెలిసిందే . బన్నీ కి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండటంతో అల్లు అర్జున్ నటించిన ప్రతీ చిత్రాన్ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు . ఇటీవల తెలుగులో విజయం సాధించిన ”సరైనోడు ” చిత్రాన్ని మలయాళంలో ”యోధవు ” అనే పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . మలయాళంలో యోధవు భారీ వసూళ్ళ ని సాధిస్తూ రెండు వారాల్లోనే 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళ ని సాధించి అక్కడి హీరోల్ని ఆశ్చర్యపరిచింది. దాదాపు రెండున్నర కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టిస్తోంది . బాహుబలి తర్వాత మలయాళం లో భారీ విజయం సాధించిన తెలుగు చిత్రం సరైనోడే కావడం విశేషం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ , కేథరిన్ లు నటించారు. నిజానికి ఈ సినిమా తెలుగులో విడుదలైన స్టార్టింగ్ లో డివైడ్ టాక్ వచ్చింది. చాలా మంది సినిమా ఫ్లాప్ అన్నారు. కానీ అల్లు అరవింద్ తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి, సినిమా జాతకాన్ని మార్చేశాడు. మొత్తం మార్కెట్ ను బన్నీ వైపు తిప్పాడు. కానీ కేరళలో ఆ పరిస్థితి ఎదురుకాలేదు. బన్నీకి ఉన్న ఫాలోయింగ్ కారణంగా… డే వన్ నుంచి సరైనోడు సినిమా కేరళలో రికార్డు వసూళ్లు సృష్టించింది. ఇప్పటికే సరైనోడు సినిమా 60కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిందని చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ 6 కోట్లు కూడా కలుపుకుంటే.. నిర్మాతలు చెప్పిన ప్రకారం లెక్క 66కోట్ల రూపాయలకు చేరుతుందన్నమాట.
First Published:  15 Jun 2016 6:00 AM GMT
Next Story