Telugu Global
Cinema & Entertainment

హీరోగా మారనున్న మాజీ సీఎం కొడుకు...

రాజకీయ నేతల కొడుకులు, బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటవారసులు హీరోలుగా మారడం కామన్. అయితే వీళ్లను ఎవరు డైరక్ట్ చేస్తున్నారనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలా ఇప్పుడు స్టార్ డైరక్టర్ కొరటాల శివపై ఫోకస్ పెరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ ను.. కొరటాల హీరోగా పరిచయం చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో గుప్పుమంది.  ప్రస్తుతం కన్నడంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘జాగ్వార్’ సినిమా ద్వారా యువ […]

హీరోగా మారనున్న మాజీ సీఎం కొడుకు...
X
రాజకీయ నేతల కొడుకులు, బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటవారసులు హీరోలుగా మారడం కామన్. అయితే వీళ్లను ఎవరు డైరక్ట్ చేస్తున్నారనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలా ఇప్పుడు స్టార్ డైరక్టర్ కొరటాల శివపై ఫోకస్ పెరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ ను.. కొరటాల హీరోగా పరిచయం చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో గుప్పుమంది.
ప్రస్తుతం కన్నడంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘జాగ్వార్’ సినిమా ద్వారా యువ హీరో నిఖిల్ కుమార్ అక్కడ పరిచయం కాబోతున్నాడు. ఇక ఇప్పుడేమో తెలుగులో ఊపిరి, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలను నిర్మించి, భారీ నిర్మాణ సంస్థగా పేరుపొందిన పీవీపీ నిర్మాణ సంస్థ ద్వారా నిఖిల్ కుమార్ టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అది కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన కొరటాల శివ దర్శకత్వంలో నిఖిల్ కుమార్ హీరోగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్ చేయటానికి ఇప్పటికే పీవీపీ నిర్మాణ సంస్థ అధినేత పీవీపీ తనవంతుగా డైరెక్టర్ కొరటాలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎవరి నుంచీ ఎటువంటి అధికారక ప్రకటనా వెలువడలేదు. ఇక ఇప్పటికే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా నిఖిల్ కుమార్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ గాని ఓకే అయితే, తెలుగులో నిఖిల్ పేరుతో ఇద్దరు హీరోలు కొనసాగుతారన్నమాట.
First Published:  13 Jun 2016 11:36 PM GMT
Next Story