Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య అభిమానుల్లో దుమారం లేపిన  జూనియ‌ర్ ఎన్టీఆర్ ..!

ఎన్నేళ్లు వచ్చినా, ఎన్నితరాలు మారినా, తమ తరం హీరోలకు ఇన్స్‌పిరేషన్ చిరంజీవి ఇవే మాటలు వేరే ఏ హీరో చెప్పినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అదీ నిజమే అన్నట్టుగా సర్దుకు పోయే వారు. అయితే మా అవార్డ్స్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలు చెప్పటం నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మా టివి అవార్డ్స్ ఫంక్షన్‌ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల పై […]

బాల‌య్య అభిమానుల్లో దుమారం లేపిన  జూనియ‌ర్ ఎన్టీఆర్ ..!
X

ఎన్నేళ్లు వచ్చినా, ఎన్నితరాలు మారినా, తమ తరం హీరోలకు ఇన్స్‌పిరేషన్ చిరంజీవి ఇవే మాటలు వేరే ఏ హీరో చెప్పినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అదీ నిజమే అన్నట్టుగా సర్దుకు పోయే వారు. అయితే మా అవార్డ్స్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మాటలు చెప్పటం నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మా టివి అవార్డ్స్ ఫంక్షన్‌ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల పై అప్పుడే బాలకృష్ణ అభిమానులు పెనుదుమారం సృష్టిస్తున్నారు .

చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా “టెంపర్” చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న తరువాత అనుకోకుండా జూనియర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయి. చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్న వెంటనే తమ తరం హీరోలకు ఇన్స్‌పిరేషన్ చిరంజీవి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు ఎంటీఆర్. చిరంజీవి పేరు జూనియర్ నోటి వెంటరాగానే అభిమానుల కేకలు ఈలలతో మా అవార్డ్స్ ఫంక్షన్ ప్రాంగణం అదిరి పోయింది. నందమూరి అభిమానులకు మాత్రం జూనియర్ మాటలు మింగుడు పడలేదు. అయితే వెంటనే సర్దుకుని బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ పేర్లను చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది.

అయితే అసలు పేర్లను వదిలేసి మొదట చిరంజీవి పేరు చెప్పడం ఏమిటని బాలయ్య అభిమానులు జూనియర్ మాటల పై మండి పడుతున్నారు. ఏ వంశం పేరు చెప్పుకోనైతే పైకొచ్చాడో ఆ తాత గారి పేరు మర్చిపోయాడా అంటూ అంటూ సొషల్ మీడియా లో రెచ్చిపోయారు.

First Published:  12 Jun 2016 11:07 PM GMT
Next Story