Telugu Global
NEWS

గ్లోబల్‌ ఆసుపత్రిపై బీజేపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌ గ్లోబల్‌ ఆసుపత్రిపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కోరారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నిఖిల్‌ రెడ్డి ఎత్తుపెంచుతామని అశాస్త్రీయ పద్ధతిలో ఆపరేషన్‌ చేసి రెండు కాళ్లను కట్‌చేసిన ఆసుపత్రి యాజమాన్యాన్ని, డాక్టర్‌ను శిక్షించాలని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితర నేతలు డిమాండ్‌ చేశారు. కాళ్లు ఎత్తు పెంచడానికి రెండు కాళ్లు కట్‌చేసి మళ్లీ ఎముకలు పెరిగేలా చూసే ఈ ఆపరేషన్‌ హైదరాబాద్‌లో మొదటిసారిగా నిఖిల్‌రెడ్డికి చేశారని, ప్రయోగాత్మకంగా […]

గ్లోబల్‌ ఆసుపత్రిపై బీజేపీ నేతల ఫిర్యాదు
X

హైదరాబాద్‌ గ్లోబల్‌ ఆసుపత్రిపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కోరారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నిఖిల్‌ రెడ్డి ఎత్తుపెంచుతామని అశాస్త్రీయ పద్ధతిలో ఆపరేషన్‌ చేసి రెండు కాళ్లను కట్‌చేసిన ఆసుపత్రి యాజమాన్యాన్ని, డాక్టర్‌ను శిక్షించాలని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితర నేతలు డిమాండ్‌ చేశారు.

కాళ్లు ఎత్తు పెంచడానికి రెండు కాళ్లు కట్‌చేసి మళ్లీ ఎముకలు పెరిగేలా చూసే ఈ ఆపరేషన్‌ హైదరాబాద్‌లో మొదటిసారిగా నిఖిల్‌రెడ్డికి చేశారని, ప్రయోగాత్మకంగా చేసిన ఈ ఆపరేషన్‌ నిఖిల్‌రెడ్డి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ఆపరేషన్‌ తరువాత వారం రోజుల్లో తిరిగి నడిపిస్తామని చెప్పిన ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటికి రెండునెలలవుతన్నా నిఖిల్‌ బెడ్‌మీదనుంచి లేవలేకపోతున్నాడని, డబ్బుల కక్కుర్తితో తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిఖిల్‌కు ఆపరేషన్‌ చేసిన గ్లోబల్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని తీవ్రంగా శిక్షించాలని కోరారు.

Click on Image to Read:

tuni-train-incident

bramhini

minister-narayana

ys-jagan

ts-congress

buggana-rajendranath-reddy

tdp-mla-madhava-naidu

sakshi

babumohan

gangula-prabakar-reddy-rama

yanamala-ramakrishnudu-swis

yanamala

chandrababu-naidu

jagan-chandra-babu

vasireddy-padma-vs-mla-anit

mla-ashok-reddy

mlc-satish-reddy

avinash-reddy

First Published:  10 Jun 2016 3:03 AM GMT
Next Story