Telugu Global
Health & Life Style

ఈ వ్య‌క్తి గుండె లేకుండానే 17 నెల‌లు బ‌తికేశాడు!

అవ‌య‌వాలు పాడైన‌ప్పుడు, వాటి స్థానంలో  కొత్త‌వాటిని అమ‌ర్చాలంటే స‌మ‌యం ప‌డుతుంది. ఎందుకంటే అన్నివిధాలా పేషంట్‌కి త‌గిన అవ‌య‌వాన్ని ఇచ్చే డోన‌ర్ దొర‌కాల్సి ఉంటుంది. అమెరికాలో స్టాన్ లార్కిన్ (25)కి కార్డియోమ‌యోపతి కార‌ణంగా గుండె ప‌నిచేయ‌ని స్థితికి చేరింది. 2014 డిసెంబ‌ర్‌లో అత‌ని గుండె పూర్తిగా వైఫ‌ల్యం చెందిన‌ట్టుగా వైద్యులు గుర్తించారు. గుండె మార్పిడి ఒక్క‌టే ప‌రిష్కారం కాగా,  అప్ప‌టికి అత‌నికి త‌గిన గుండె దొర‌క‌లేదు. దాంతో వైద్యులు పాడైపోయిన గుండెని పూర్తిగా తొల‌గించి, గుండె చేసే ప‌నులు […]

ఈ వ్య‌క్తి గుండె లేకుండానే 17 నెల‌లు బ‌తికేశాడు!
X

అవ‌య‌వాలు పాడైన‌ప్పుడు, వాటి స్థానంలో కొత్త‌వాటిని అమ‌ర్చాలంటే స‌మ‌యం ప‌డుతుంది. ఎందుకంటే అన్నివిధాలా పేషంట్‌కి త‌గిన అవ‌య‌వాన్ని ఇచ్చే డోన‌ర్ దొర‌కాల్సి ఉంటుంది. అమెరికాలో స్టాన్ లార్కిన్ (25)కి కార్డియోమ‌యోపతి కార‌ణంగా గుండె ప‌నిచేయ‌ని స్థితికి చేరింది. 2014 డిసెంబ‌ర్‌లో అత‌ని గుండె పూర్తిగా వైఫ‌ల్యం చెందిన‌ట్టుగా వైద్యులు గుర్తించారు. గుండె మార్పిడి ఒక్క‌టే ప‌రిష్కారం కాగా, అప్ప‌టికి అత‌నికి త‌గిన గుండె దొర‌క‌లేదు.

దాంతో వైద్యులు పాడైపోయిన గుండెని పూర్తిగా తొల‌గించి, గుండె చేసే ప‌నులు నిర్వ‌ర్తించ‌డానికి వీలుగా ఒక మెషిన్‌ని శ‌రీరం బ‌య‌టే అమ‌ర్చారు. అంటే అది, శ‌రీరంలో గుండె అనే అవ‌య‌మే లేని స్థితి అన్న‌మాట‌. ఈ స్థితిలో అత‌ను 17 నెలలు జీవించాడు. జ‌న్యుప‌రంగా వ‌చ్చిన స‌మ‌స్య‌ల కార‌ణంగా లార్కిన్‌తో పాటు అత‌ని అన్న‌కు కూడా గుండె పాడైన‌ట్టుగా వైద్యులు ఒకేసారి గుర్తించినా, మొట్ట‌మొద‌ట కృత్రిమ గుండెని లార్కిన్‌కి అమ‌ర్చారు. సిన్‌కార్డియా ప్రీడ‌మ్ పోర్ట‌బుల్ డ్రైవ‌ర్ అనే ఈ మెషిన్ బ‌రువు 13.5 పౌన్లు (దాదాపు ఆరు కిలోలు). దీన్ని బ్యాగులా భుజానికి త‌గిలించుకునే వీలుంటుంది. ఈ మెషిన్ గుండెలాగే శ‌రీరంలోని భాగాల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లుగుతుంది.

పూర్తి స్థాయిలో హార్ట్ ఫెయిల్ అయిన‌వారి కోసం దీన్ని రూపొందించారు. లార్కిన్ త‌రువాత అత‌ని సోద‌రుడికి సైతం ఈ కృత్రిమ గుండెని అమ‌ర్చారు. అయితే అత‌నికి గ‌త ఏడాదే గుండె మార్పిడి ఆప‌రేష‌న్ చేశారు. కానీ లార్కిన్‌కి మాత్రం త‌గిన గుండె దొర‌క‌క‌పోవ‌టంతో అత‌ను 17 నెల‌ల పాటు శ‌రీరంలో గుండె లేకుండానే, మెషిన్ ఆధారంగా జీవించాడు. చివ‌రికి కింద‌టి నెల‌లోనే లార్కిన్‌కి గుండె మార్పిడి ఆప‌రేష‌న్‌ని విజ‌య‌వంతంగా చేశారు. మిచిగాన్ యూనివ‌ర్శిటీలో కార్డియాక్ స‌ర్జ‌రీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ జోనాథ‌న్ హాప్ట్ లార్కిన్‌కి… మొద‌ట గుండెని తీసి మిష‌న్‌ని అమ‌ర్చ‌టం, త‌రువాత గుండె మార్పిడి…ఈ రెండు ఆప‌రేష‌న్లను నిర్వ‌హించారు. లార్కిన్ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. త‌న‌కు గుండెని దానం చేసిన వ్య‌క్తి కుటుంబాన్ని క‌లిసి వారికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతాన‌ని అంటున్నాడు. మొత్తానికి గుండె లేకుండా బ‌తికిన అత‌ని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

First Published:  9 Jun 2016 2:51 AM GMT
Next Story