Telugu Global
NEWS

కోమ‌టిరెడ్డి వ్యూహం ఏంటి..?

టీపీసీసీ నాయ‌కుల‌పై మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అయినా వాటిపై వెంక‌ట‌రెడ్డి వెన‌క్కి త‌గ్గ‌లేదు. అస‌లు టీపీసీసీని తానే గుర్తించ‌న‌పుడు, షోకాజ్ నోటీసుల‌ను ఎలా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఆయ‌న పార్టీ మారుతారంటూ వార్త‌లు వ‌స్తున్న వేళ‌.. ఇలాంటి వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని పెంచాయి. ఆయ‌న వ్య‌వ‌హార శైలి ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. ఇంత‌కీ.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పార్టీ మార‌తాడా? లేదా పార్టీలోనే ఉండి త‌న‌కు […]

కోమ‌టిరెడ్డి వ్యూహం ఏంటి..?
X

టీపీసీసీ నాయ‌కుల‌పై మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అయినా వాటిపై వెంక‌ట‌రెడ్డి వెన‌క్కి త‌గ్గ‌లేదు. అస‌లు టీపీసీసీని తానే గుర్తించ‌న‌పుడు, షోకాజ్ నోటీసుల‌ను ఎలా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఆయ‌న పార్టీ మారుతారంటూ వార్త‌లు వ‌స్తున్న వేళ‌.. ఇలాంటి వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని పెంచాయి. ఆయ‌న వ్య‌వ‌హార శైలి ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. ఇంత‌కీ.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పార్టీ మార‌తాడా? లేదా పార్టీలోనే ఉండి త‌న‌కు టీపీసీసీ ప‌గ్గాలు కావాల‌ని కోరుతున్నాడా? లేక పార్టీని వ‌దిలేముందు చేత‌నైనంత ర‌చ్చ చేసి వెళ్లిపోదామ‌నుకుంటున్నాడా? ఇదంతా కోమ‌టిరెడ్డి సొంత ఆలోచ‌నేనా? లేదా కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీసేందుకు కేసీఆర్ వ్యూహ‌మా? అన్న ప్ర‌శ్న‌లు ప్ర‌జ‌ల‌ను, రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను వేధిస్తున్నాయి.

పార్టీ మార‌డం లేదా?
వెంక‌ట‌రెడ్డి ఆదివారం ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌లో ఇంత దారుణ‌మైన నాయ‌కుడిని తానెప్పుడూ చూడ‌లేద‌న్నారు. కుళ్లు, కుట్ర‌లు, కుతంత్రాల‌కు ఆయ‌న చిరునామా అని ఎద్దేవా చేశారు. ఉద్య‌మంలో జ‌రుగుతున్న త్యాగాలు, ఆత్మ‌బ‌లిదానాలు చూసి తాను మంత్రి ప‌ద‌విని వ‌దిలేశాన‌ని గుర్తు చేసుకున్నారు. తాను వ‌దిలేసిన మంత్రి ప‌ద‌విని తీసుకుని అనుభ‌వించిన నేత ఉత్త‌మ్ అని విమ‌ర్శించారు. త‌న‌కు నోటీసులు ఇచ్చే అధికారం ఎవ‌రికీ లేద‌ని, ఈ వ్య‌వ‌హారాన్ని నేరుగా సోనియా గాంధీ వ‌ద్దే తేల్చుకుంటాన‌ని చెప్పారు. తాను పార్టీ మార‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్ర‌చార‌మంతా మీడియాలోనే చూశాన‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగిన‌ట్ల‌యింది.

పాత పంథానే అనుస‌రిస్తున్నారా?
గ‌తంలో పార్టీలు మారే ప‌లువురు నేత‌లు అప్ప‌టిక‌ప్ప‌డు నిర్ణ‌యం తీసుకునే వారు కాదు. ఆ పార్టీని బ‌హిరంగంగా ప‌లు వేదిక‌ల‌పై దూషించి, బ‌హిష్క‌ర‌ణ వేటు ప‌డేలా చేసుకునేవారు. ఆ త‌రువాత తాము కావాల‌నుకున్న పార్టీలోకి వెళ్లేవారు. ఇదంతా ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కారం జ‌రిగేది. వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారం ఇదే పంథాలో ఉన్నట్లుగా ఉంది. కానీ, ఆయ‌న‌పార్టీ మారే వ్య‌వ‌హారాన్ని ఖండించ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఆయ‌న పార్టీపై తిరుగుబాటు లేవ‌దీస్తున్నారా? లేక కారెక్కే ప‌థ‌కంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేందుకు మరికాస్త స‌మ‌యం ప‌డుతుంది.

First Published:  5 Jun 2016 11:27 PM GMT
Next Story