Telugu Global
Cinema & Entertainment

నాగ్ పెళ్ళి రోజున చైతు సమంత ప్రేమమ్ పై క్లారిటీ వస్తుందా ?

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ప్రేమమ్. ఈ సినిమా ఇప్పటికే పోస్టర్స్ తో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. టీజర్ విడుదలకు కూడా ఓ ప్రత్యేకమైన తేదీని నిర్ణయించారు. నాగార్జున-అమల పెళ్ళిరోజైన జూన్ 11 నాడు ప్రేమమ్ టీజర్ విడుదల చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎందుకంటే…. ఇప్పటివరకు తమ పెళ్లి రోజును కేవలం ఓ ప్రైవేటు ఎఫైర్ గా మాత్రమే ట్రీట్ […]

నాగ్ పెళ్ళి రోజున చైతు సమంత ప్రేమమ్ పై క్లారిటీ వస్తుందా ?
X

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ప్రేమమ్. ఈ సినిమా ఇప్పటికే పోస్టర్స్ తో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. టీజర్ విడుదలకు కూడా ఓ ప్రత్యేకమైన తేదీని నిర్ణయించారు. నాగార్జున-అమల పెళ్ళిరోజైన జూన్ 11 నాడు ప్రేమమ్ టీజర్ విడుదల చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎందుకంటే…. ఇప్పటివరకు తమ పెళ్లి రోజును కేవలం ఓ ప్రైవేటు ఎఫైర్ గా మాత్రమే ట్రీట్ చేశారు నాగార్జున-అమల. పెళ్లి రోజు నాడు అన్ని పనులు పక్కనపెట్టేస్తాడు నాగ్. అమలతో కలిసి ఇంట్లోనే ఉండడమో… లేక వేరే ప్రదేశానికి వెళ్లడమో చేశాడు. కానీ ఈ పెళ్లి రోజు నాడు పెద్దకొడుకు నాగచైతన్య టీజర్ విడుదల చేయాల్సి వస్తుందనే విషయంపై నాగార్జున ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. పెళ్లి రోజును కూడా అభిమానులు, సినిమా యూనిట్ మధ్య సెలబ్రేట్ చేసుకోవడం నాగ్-అమల దంపతులకు ఇష్టం లేదు. అందుకే ప్రేమమ్ టీజర్ విడుదలపై వాళ్లు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై నాగార్జున ఓ నిర్ణయం తీసుంటాడు. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు అమలను కూడా సంప్రదించనున్నాడు. ఎందుకంటే… ఇది ఇద్దరూ కలిసి తీసుకోవాల్సి నిర్ణయం. అటు చైతూ మాత్రం ప్రేమమ్ టీజర్ పై పెదవి విప్పడం లేదు. అంతా నాగార్జున ఇష్టం అంటున్నాడు.

Click on Image to Read:

ramcharan

pawan
mahesh-babu

First Published:  6 Jun 2016 1:14 AM GMT
Next Story