బయ్యర్లను ఓదార్చే కార్యక్రమంలో పవన్ కల్యాణ్
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ హిట్ అన్నది పక్కనపెట్టి… ఏ రేంజ్ ఫ్లాప్ అనేది అంతా లెక్కలేసుకుంటున్నారు. సినిమా ఫైనల్ రన్ కూడా ముగిసిపోవడంతో సినిమాకు ఏ ఏరియాలో ఎంత నష్టం వచ్చిందో తాపీగా లెక్కలేసుకుంటున్నాడు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతోనే వెంటనే మరో సినిమా ప్రకటించాడు పపన్. కేవలం బయ్యర్లను ఆదుకునేందుకే వెంటనే మరో సినిమా ప్రకటించాడనే విషయం అందరికీ అర్థమైంది. అందుకు తగ్గట్టే తన కొత్త సినిమాకు 25శాతం రిబేటు కూడా […]
BY admin5 Jun 2016 12:45 AM GMT
X
admin Updated On: 5 Jun 2016 1:06 AM GMT
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ హిట్ అన్నది పక్కనపెట్టి… ఏ రేంజ్ ఫ్లాప్ అనేది అంతా లెక్కలేసుకుంటున్నారు. సినిమా ఫైనల్ రన్ కూడా ముగిసిపోవడంతో సినిమాకు ఏ ఏరియాలో ఎంత నష్టం వచ్చిందో తాపీగా లెక్కలేసుకుంటున్నాడు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతోనే వెంటనే మరో సినిమా ప్రకటించాడు పపన్. కేవలం బయ్యర్లను ఆదుకునేందుకే వెంటనే మరో సినిమా ప్రకటించాడనే విషయం అందరికీ అర్థమైంది. అందుకు తగ్గట్టే తన కొత్త సినిమాకు 25శాతం రిబేటు కూడా ఇచ్చాడు. అంతేకాదు… ఇప్పుడు ఏకంగా తన పారితోషికం నుంచి కూడా కొంత సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు పవన్ సిద్ధపడ్డాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం… ఎస్ జే సూర్య దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు పవన్ 30కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెమ్యూనరేషన్ నుంచి 6 కోట్ల రూపాయల మొత్తాన్ని బయ్యర్ల కోసం వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. సినిమా పట్టాలపైకి వెళ్లకముందే ఈ లెక్కలన్నీ తేల్చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఒక్కసారి సినిమా స్టార్ట్ అయ్యాక మళ్లీ ఈ నష్టాల లెక్కలన్నీ గుర్తొస్తే.. ఆ ప్రభావం సినిమాపై పడుతుందనేది పవన్ ఫీలింగ్. అందుకే సెట్స్ పైకి వెళ్లకముందే బయ్యర్లను ఓదార్చే కార్యక్రమం షురూ చేశాడు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా హిట్టయితే… పవన్-నిర్మాత సంగతేమో కానీ… బయ్యర్లు మాత్రం ఫుల్ హ్యాపీ.
Click on Image to Read:
Next Story