Telugu Global
Cinema & Entertainment

దసరా నుంచే ఎన్టీఆర్ కొత్త సినిమా

ఒక సినిమా లైన్లో ఉండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేయడం ఎన్టీఆర్ కు అలవాటు. ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే షార్ట్ గ్యాప్ తీసుకొని మరో సినిమా సెట్స్ లోకి వెళ్లిపోతాడు. తాజాగా మరోసారి అదే పనిచేశాడు తారక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమా ఈమధ్యే చెన్నై షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రేపట్నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా… వక్కంతం వంశీ […]

దసరా నుంచే ఎన్టీఆర్ కొత్త సినిమా
X
ఒక సినిమా లైన్లో ఉండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేయడం ఎన్టీఆర్ కు అలవాటు. ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే షార్ట్ గ్యాప్ తీసుకొని మరో సినిమా సెట్స్ లోకి వెళ్లిపోతాడు. తాజాగా మరోసారి అదే పనిచేశాడు తారక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమా ఈమధ్యే చెన్నై షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రేపట్నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా… వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాననే విషయాన్ని ఇటీవలే ప్రకటించాడు తారక్. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుదనే విషయాన్ని తాజాగా కన్ ఫర్మ్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం… దసరా నుంచి వక్కంతం వంశీ సినిమా పట్టాలపైకి వస్తుంది. అప్పటికి జనతా గ్యారేజీ సినిమా విడుదలైపోతుంది కాబట్టి… వక్కంతం ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టిపెడతాడు తారక్. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు వక్కంతం వంశీ. అటు మరో హీరో కల్యాణ్ రామ్ ఈ సినిమాను తన సొంత బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించబోతున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేస్తారు. ఇందులో హీరోయిన్ ఎవరనే అంశాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. తాజా సమాచారం ప్రకారం… రకుల్ ప్రీత్ సింగ్ ను మరోసారి రిపీట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
First Published:  4 Jun 2016 11:09 PM GMT
Next Story