Telugu Global
Cinema & Entertainment

ప్ర‌భాసే నా హీరో అంటున్నముద్దుగుమ్మ‌

కొన్ని క‌టౌట్స్ ఎంత ఎత్తుగా చేయించినా పెద్ద‌గా ఎవిరికి రిజ‌స్ట్ర‌ర్ కావు. అదే ప్ర‌భాస్ క‌టౌట్ అయితే.. ఫ్యాన్స్ కే కాదు.. హీరోయిన్స్ కు కూడా బాగా రిజిస్ట్ర‌ర్ అవుతుందని ఈ ఉదంతం చెబుతుంది.. బ్రిటీష్ హీరోయిన్ ఎమి జాక్స‌న్ కు తెలుగులో ప్ర‌భాస్ తో ఎప్ప‌టికైన న‌టించాల‌నేది క‌ల‌ట‌. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన ఎవ‌డు చిత్రంలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ .. త‌మిళ్ చిత్రం 1947 ల‌వ్ స్టోరి లో ఆర్య తో […]

ప్ర‌భాసే నా హీరో అంటున్నముద్దుగుమ్మ‌
X

కొన్ని క‌టౌట్స్ ఎంత ఎత్తుగా చేయించినా పెద్ద‌గా ఎవిరికి రిజ‌స్ట్ర‌ర్ కావు. అదే ప్ర‌భాస్ క‌టౌట్ అయితే.. ఫ్యాన్స్ కే కాదు.. హీరోయిన్స్ కు కూడా బాగా రిజిస్ట్ర‌ర్ అవుతుందని ఈ ఉదంతం చెబుతుంది.. బ్రిటీష్ హీరోయిన్ ఎమి జాక్స‌న్ కు తెలుగులో ప్ర‌భాస్ తో ఎప్ప‌టికైన న‌టించాల‌నేది క‌ల‌ట‌. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన ఎవ‌డు చిత్రంలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ .. త‌మిళ్ చిత్రం 1947 ల‌వ్ స్టోరి లో ఆర్య తో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌రువాత శంక‌ర్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఐ చిత్రంలో న‌టించి మెప్పించింది. క‌ట్ చేస్తే తాజాగా రోబో చిత్రంలో ర‌జనీ సర‌స‌న న‌టిస్తుంది.

ప్ర‌స్తుతం బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ తో బిజీగా వున్న ప్ర‌భాస్.. ఈ చిత్రం కంప్లీట్ అయిన త‌రువాత‌., సుజిత్ డైరెక్ష‌న్ లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు..త‌మిళ్ లో కూడ చేయ‌డానికి ప్ర‌ణాళిక చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ నే హీరోయిన్ గా తీసుకుంటార‌నే టాక్ వినిపిస్తుంది. ఇదే నిజ‌మైతే ఈ ముద్దుగుమ్మ డ్రీమ్ నిజం అయిన‌ట్లే మ‌రి.

First Published:  4 Jun 2016 2:51 AM GMT
Next Story