Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కు బొకే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది..

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సెట్‌కు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ చేరుకుని… తారక్‌కు కాస్త ఆలస్యంగానైనా హ్యాపీ బర్త్‌డే చెప్పాడు. బొకే ఇచ్చి ఫ్రెష్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా తారక్‌, శివ కొరటాలతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను దేవిశ్రీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా… నా స్నేహితుడు తారక్‌కు బిలేటెడ్‌ […]

ఎన్టీఆర్ కు బొకే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది..
X

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సెట్‌కు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ చేరుకుని… తారక్‌కు కాస్త ఆలస్యంగానైనా హ్యాపీ బర్త్‌డే చెప్పాడు. బొకే ఇచ్చి ఫ్రెష్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా తారక్‌, శివ కొరటాలతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను దేవిశ్రీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా… నా స్నేహితుడు తారక్‌కు బిలేటెడ్‌ హ్యాపీ బర్త్‌డే అని దేవిశ్రీ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెల 20న తారక్‌ తన పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున దేవిశ్రీప్రసాద్ అమెరికాలో ఉన్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి పాటల కంపోజింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే లేటెస్ట్ గా ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పాడు. శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న జనతా గ్యారేజ్‌ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. సమంత, నిత్యా మేనన్‌ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు

First Published:  29 May 2016 10:41 PM GMT
Next Story