Telugu Global
Cinema & Entertainment

అవును... వాళ్లిద్దరూ కలిసిపోయారు...

ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య కత్తులు దూసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అంతా కలిసిపోతున్నారు. కలసికట్టుగా స్నేహగీతం ఆలపిస్తున్నారు. అవసరమైతే అవకాశాలు  కూడా పంచుకుంటున్నారు. సినిమాల విషయంలో హీరోల్ని ఎక్స్ చేంజ్ చేసుకుంటున్నారు. షూటింగ్ లు లేనప్పుడు సరదాగా పార్టీలు చేసుకుంటున్నారు. సమంత తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈమధ్యే తమన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే శృతిహాసన్, తమన్న తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈమధ్య కాజల్ కూడా చెప్పుకొచ్చింది. హీరోయిన్లంతా ఇలా కలిసిపోతుంటే… మొన్నటిదాకా ఎడమొహం-పెడమొహంగా […]

అవును... వాళ్లిద్దరూ కలిసిపోయారు...
X
ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య కత్తులు దూసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అంతా కలిసిపోతున్నారు. కలసికట్టుగా స్నేహగీతం ఆలపిస్తున్నారు. అవసరమైతే అవకాశాలు కూడా పంచుకుంటున్నారు. సినిమాల విషయంలో హీరోల్ని ఎక్స్ చేంజ్ చేసుకుంటున్నారు. షూటింగ్ లు లేనప్పుడు సరదాగా పార్టీలు చేసుకుంటున్నారు. సమంత తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈమధ్యే తమన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే శృతిహాసన్, తమన్న తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈమధ్య కాజల్ కూడా చెప్పుకొచ్చింది. హీరోయిన్లంతా ఇలా కలిసిపోతుంటే… మొన్నటిదాకా ఎడమొహం-పెడమొహంగా ఉన్న ఇద్దరు భామలు కూడా తాజాగా కలిసిపోయారు. తమిళనాట అనుష్క, లక్ష్మీరాయ్ కు కాస్త పడదనే పుకారు ఉండేది అప్పట్లో. సూర్య, అజిత్ గతంలో చేసిన సినిమాల సందర్భంగా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని కొన్ని నెలల కిందట తమిళ మీడియా కోడైకూసింది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ…. బొమ్మాళి ఎప్పుడూ లక్ష్మీరాయ్ పేరు ప్రస్తావించలేదు. అటు లక్ష్మీ రాయ్ కూడా ఎప్పుడూ అనుష్క పేరును ఎత్తలేదు. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందంటూ టోటల్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే అందులో వాస్తవం లేదని లక్ష్మీరాయ్ ప్రకటించింది. కేవలం ప్రకటన చేయడం మాత్రమే కాదు… అనుష్క తో దిగిన ఓ సెల్ఫీని కూడా పోస్ట్ చేసింది. మేమిద్దరం ఎంతలా కలిసిపోయామో చూడండి అంటోంది. ఫొటో చూస్తుంటే ముద్దుగుమ్మలిద్దరూ కలిసిపోయినట్టే కనిపిస్తున్నారు.
First Published:  29 May 2016 10:44 PM GMT
Next Story