Telugu Global
Cinema & Entertainment

షకలక శంకర్ కు కూడా పవన్ లోకువైపోయాడా...

హిట్ ఉన్నప్పుడే అంతా హీరోను ఆకాశానికెత్తేస్తారు. ఒక్క ఫ్లాప్ వస్తే ఊహించని వ్యక్తులు కూడా ఏవో ఒకటి అంటుంటారు. ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కే ఈ పరిస్థితి ఎదురైంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్  టైమ్ లో షకలక శంకర్ ను పవన్ కల్యాణ్ కొట్టాడనే ప్రచారం జరిగింది. దానిపై అప్పట్లోనే షకలక శంకర్ వివరణ ఇచ్చాడు. పవన్ తనను పల్లెత్తు మాట కూడా అనలేదని, పైగా తను ఇంటి నుంచి […]

షకలక శంకర్ కు కూడా పవన్ లోకువైపోయాడా...
X

హిట్ ఉన్నప్పుడే అంతా హీరోను ఆకాశానికెత్తేస్తారు. ఒక్క ఫ్లాప్ వస్తే ఊహించని వ్యక్తులు కూడా ఏవో ఒకటి అంటుంటారు. ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కే ఈ పరిస్థితి ఎదురైంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ టైమ్ లో షకలక శంకర్ ను పవన్ కల్యాణ్ కొట్టాడనే ప్రచారం జరిగింది. దానిపై అప్పట్లోనే షకలక శంకర్ వివరణ ఇచ్చాడు. పవన్ తనను పల్లెత్తు మాట కూడా అనలేదని, పైగా తను ఇంటి నుంచి తెచ్చిన వంటల్ని తిని మెచ్చుకున్నారని కూడా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. సినిమా విడుదలైంది. సర్దార్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు షకలక శంకర్ కు గతం గుర్తొచ్చింది. అప్పటి వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. ఫ్లాప్ వచ్చింది కాబట్టి తనను ఎవరూ ఏం చేయలేరని అనుకున్నాడేమో…. అప్పట్లో పవన్ తనను బాగా తిట్టాడని ఆరోపిస్తున్నాడు. ప‌వ‌న్‌కు వీరాభిమాని అయిన ష‌క‌ల‌క శంక‌ర్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. అయితే షూటింగు స‌మ‌యంలో శంక‌ర్ చేసిన అతి, తాగి షూటింగ్‌కు లేటుగా రావ‌డం, డైరెక్ట‌ర్ చెప్పిన‌ది విన‌క‌పోవ‌డం, స‌హ‌న‌టుల్ని వేళాకోలం చేయ‌డం వంటివి చేశాడ‌ని టాక్‌. అయితే ఇది ప‌వ‌న్ వ‌ర‌కూ చేర‌డంతో ఒక‌సారి వార్నింగ్ ఇచ్చాడ‌ని, అయినా శంక‌ర్ మార‌క‌పోవ‌డంతో చెంప ఛెళ్లుమ‌నిపించాడ‌ని ప్ర‌చారం బ‌య‌ట‌కొచ్చింది. త‌నను పవన్ కళ్యాణ్ హెచ్చరించింది నిజమేనని, కొట్ట‌డం మాత్రం చేయ‌లేద‌ని చెప్పుకొచ్చాడు శంక‌ర్‌.

First Published:  29 May 2016 1:54 AM GMT
Next Story