Telugu Global
NEWS

అమరావతిలో భూమి కోసం మరదలి రేప్

హైదరాబాద్  కేపీహెచ్ బీ పరిధిలోని  ప్రగతి నగర్‌లో ఒక వ్యక్తి తన మరదలిపై దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి చనిపోవడంతో చిన్నప్పటి నుంచి మేనమామ ఇంట్లోనే పెరిగిన సదరు వ్యక్తి చివరకు మేనమామ కూతురి జీవితాన్నే నాశనం చేశాడు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 20న మరదలిపై బావ కొమ్మినేని అజయ్ కుమార్ అత్యాచారం చేశాడు. నగ్నచిత్రాలు తీశాడు. బయటకు చెబితే ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. […]

అమరావతిలో భూమి కోసం మరదలి రేప్
X

హైదరాబాద్ కేపీహెచ్ బీ పరిధిలోని ప్రగతి నగర్‌లో ఒక వ్యక్తి తన మరదలిపై దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి చనిపోవడంతో చిన్నప్పటి నుంచి మేనమామ ఇంట్లోనే పెరిగిన సదరు వ్యక్తి చివరకు మేనమామ కూతురి జీవితాన్నే నాశనం చేశాడు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈనెల 20న మరదలిపై బావ కొమ్మినేని అజయ్ కుమార్ అత్యాచారం చేశాడు. నగ్నచిత్రాలు తీశాడు. బయటకు చెబితే ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. అయితే యువతి ధైర్యం చేసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం చెప్పాడు. యువతి పేరు మీద ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో భారీగా భూమి ఉంది. ఈ విషయం నిందితుడికి తెలుసు. ఎలాగైనా భూమిని దక్కించుకోవాలనుకున్నాడు. ఇందుకు మరదలిని లొంగదీసుకోవాలని చూశాడు కొమ్మినేని అజయ్.

ఆమె అందుకు అంగీకరించకపోవడంతో అత్యాచారం చేశాడు. అంతా చేసి పెళ్లి చేసుకుంటానని కొత్తనాటకం మొదలుపెట్టాడు. అయితే అతడి దురుద్దేశం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరదలి ఆస్తి మరొకరికి వెళ్లకుండా దక్కించుకోవాలనే తానీ పనిచేసినట్టు నిందితుడు కొమ్మినేని అజయ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. నిందితుడికి ఇప్పటికే వివాహం కూడా అయింది. భార్య సాప్ట్‌వేర్ ఇంజనీర్. ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అమరావతి ప్రాంతంలో భూముల విలువ బాగా తెలిసిన కొమ్మినేని అజయ్ ఇంత పని చేశాడు. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Click on Image to Read:

rajareddy

MLA-Satish-Reddy

gottipati-jagan

prakasha-tdp

swaroopanandendra-saraswati

kothapalli-subbarayudu

sonia-gandhi-venkaiah

lokesh-chandrababu-naidu

chalasani-manikyalarao

mudragada-padmanabham,-Hars

brahmotsavan-movie-review

jyothula1

jyotula

chandrababu-naidu-comments-

First Published:  23 May 2016 1:21 PM GMT
Next Story