Telugu Global
NEWS

ప్రముఖ పత్రికపైకి దండెత్తిన మహేష్ ఫ్యాన్స్- పత్రిక ఏం రాసిందంటే...

ప్రిన్స్‌ మహేష్‌ బాబు నటించన “బ్రహ్మోత్సవం” పై జరుగుతున్న ప్రచారం  మహేష్‌ అభిమానులకు కోపం తెప్పించింది. విడుదలైన మొదటి రోజునుంచే సోషల్ మీడియాలో పెద్దెత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. పెద్దసంఖ్యలో పేరడీలు వస్తున్నాయి. అయితే తాజాగా మంగళవారం ప్రముఖ ఆంగ్ల ప్రతిక ఒక పేజీ మొత్తం బ్రహ్మోత్సం సినిమాగురించి రాసింది.  ఇందులో ఎక్కువగా బ్రహ్మోత్సంపై సోషల్ మీడియాలో రన్ అవుతున్న సెటైర్లను బేస్ చేసుకుని కథనం రాసింది. అందులోనూ పవన్ కల్యాణ్, మహేష్‌ల మధ్య పోటీ అన్నట్టుగా […]

ప్రముఖ పత్రికపైకి దండెత్తిన మహేష్ ఫ్యాన్స్- పత్రిక ఏం రాసిందంటే...
X

ప్రిన్స్‌ మహేష్‌ బాబు నటించన “బ్రహ్మోత్సవం” పై జరుగుతున్న ప్రచారం మహేష్‌ అభిమానులకు కోపం తెప్పించింది. విడుదలైన మొదటి రోజునుంచే సోషల్ మీడియాలో పెద్దెత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. పెద్దసంఖ్యలో పేరడీలు వస్తున్నాయి. అయితే తాజాగా మంగళవారం ప్రముఖ ఆంగ్ల ప్రతిక ఒక పేజీ మొత్తం బ్రహ్మోత్సం సినిమాగురించి రాసింది. ఇందులో ఎక్కువగా బ్రహ్మోత్సంపై సోషల్ మీడియాలో రన్ అవుతున్న సెటైర్లను బేస్ చేసుకుని కథనం రాసింది. అందులోనూ పవన్ కల్యాణ్, మహేష్‌ల మధ్య పోటీ అన్నట్టుగా కొందరు ఆకతాయి వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టిన మార్ఫింగ్ చిత్రాలను యథావిథిగా ఇండియన్ ఎక్స్ ప్రెస్‌ ప్రచురించింది.

వాటిలో కొన్నిమహేష్‌ బాబును తీవ్రంగా అవమానించేలా ఉన్నాయి. ప్రముఖ ప్రతిక అయి ఉండి ఇలా బాధ్యత లేకుండా కథనాలు ఎలా రాస్తారంటూ మహేష్ బాబు అభిమాన సంఘం నేతలు పత్రిక కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కూడా వచ్చారు. చివరకు పత్రిక సిబ్బందితో ప్రిన్స్ అభిమాన సంఘం నాయకులు చర్చలు జరిపారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని సదరు పత్రిక హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అభిమాన సంఘ నేతలు మాట్లాడుతూ తమ నటుడు చాలా అందగాడని, మహేష్‌ బాబు ఫాలోయింగ్‌ను చూసి ఓర్వలేకే కొంతమంది ఆకతాయిలు ఇలా తప్పుగా ప్రచారంచేస్తున్నారని, వాటిని ఆధారంగా చేసుకోని పత్రికలో కథనం ప్రచురించడం దారుణమంటూ మండిపడ్డారు.express-2

Click on Image to Read:

babu-bus

gottipati-jagan

chandrababu-park-hyatt-hote

rajareddy

revanth-reddy

attar-chand-basha

lokesh

sakshi-tv

vijayawada-tdp-coporaters

adinarayana-reddy

payyavula-kasab

prof-nageshwar-rao

prakasha-tdp

angoorlatha

First Published:  24 May 2016 11:17 AM GMT
Next Story