Telugu Global
National

న్యాయానికి...అంత సెల‌వు అవ‌స‌ర‌మా!

సుప్రీంకోర్టుకి 48రోజుల సెల‌వులు  ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కొంత‌మంది మాజీ న్యాయ‌మూర్తులు ఆ సెల‌వుల‌ను త‌గ్గించి పెండింగ్ కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆశిస్తున్నారు. అయితే త‌మ ప్ర‌య‌త్నాలు చాలామంది న్యాయ‌మూర్తుల‌కు, న్యాయ‌వాదుల‌కు న‌చ్చ‌టం లేద‌ని స‌ద‌రు మాజీ న్యాయ‌మూర్తులు అంటున్నారు. కొన్నిరోజుల క్రితమే భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, హైకోర్టులో దాదాపు 40 ల‌క్ష‌ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని స‌త్వ‌రం  ప‌రిష్క‌రించాలంటే హైకోర్టుల‌కు న్యాయ‌మూర్తుల‌ను పెంచాలంటూ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆయ‌న ఈ విష‌యంలో ఎంతో భావోద్వేగానికి […]

సుప్రీంకోర్టుకి 48రోజుల సెల‌వులు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కొంత‌మంది మాజీ న్యాయ‌మూర్తులు ఆ సెల‌వుల‌ను త‌గ్గించి పెండింగ్ కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆశిస్తున్నారు. అయితే త‌మ ప్ర‌య‌త్నాలు చాలామంది న్యాయ‌మూర్తుల‌కు, న్యాయ‌వాదుల‌కు న‌చ్చ‌టం లేద‌ని స‌ద‌రు మాజీ న్యాయ‌మూర్తులు అంటున్నారు. కొన్నిరోజుల క్రితమే భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, హైకోర్టులో దాదాపు 40 ల‌క్ష‌ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని స‌త్వ‌రం ప‌రిష్క‌రించాలంటే హైకోర్టుల‌కు న్యాయ‌మూర్తుల‌ను పెంచాలంటూ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆయ‌న ఈ విష‌యంలో ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు కూడా.

ఈ నేప‌థ్యంలో కోర్టుల‌కు సెల‌వుల‌ను త‌గ్గిస్తే చాలావ‌ర‌కు పెండింగ్ కేసుల‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌ని మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కోర్టుకు ప‌దివారాల‌పాటు వేస‌వి సెల‌వులు తీసుకునే అవ‌కాశం ఉండ‌గా అది జ‌స్టిస్ వై కే స‌బ‌ర్వాల్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న‌పుడు ఎనిమిది వారాల‌కు త‌గ్గించారు.

త‌రువాత వ‌చ్చిన అనేక‌మంది ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు స‌మ్మ‌ర్ సెల‌వుల‌ను మ‌రింత‌గా త‌గ్గించాల‌ని చాలా ప్ర‌య‌త్నించారు. కానీ న్యాయ‌మూర్తులు కానీ న్యాయ‌వాదుల బార్ అసోసియేష‌న్ కానీ ఇందుకు అంగీక‌రించ‌లేదు. ఢిల్లీలో వేస‌వి ఎండ‌లు విప‌రీతంగానే ఉంటాయి. కానీ మిగిలిన వారంతా వేస‌విలో ప‌నిచేస్తూనే ఉన్నారు క‌దా అని ఒక మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అన్నారు.

న్యాయ‌మూర్తులు తాము తీసుకోబోయే సెల‌వుల గురించి ముందుగానే వెల్ల‌డిస్తే, సుప్రీంకోర్టు ఒక్క‌రోజు కూడా మూత‌ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని జ‌స్టిస్ లోధా అప్ప‌ట్లో అభిప్రాయ‌ప‌డ్డార‌ని, ఆయ‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న‌పుడే వేస‌వి సెల‌వుల‌ను ఏడువారాల‌కు త‌గ్గించార‌ని, వాటిని నాలుగువారాల‌కు కుదించ‌డం మేల‌ని ఒక మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికే సుప్రీంకోర్టు చ‌లికాలంలో రెండువారాలు, ప్ర‌ముఖ పండుగ‌ల‌కు ఓ ప‌దిరోజులు మూత‌ప‌డుతున్న‌ద‌ని, ఈ సెల‌వుల‌ను త‌గ్గించాల‌ని మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు కోరుతున్నారు. ఇలాంటి సెల‌వుల‌ను త‌గ్గిస్తే సుప్రీంకోర్టుకి అద‌నంగా మ‌రొక యాభై ప‌నిదినాలు క‌లిసివ‌స్తాయని వారు చెబుతున్నారు. ప్ర‌స్తుతం సంవ‌త్స‌రానికి సుప్రీంకోర్టు 193 రోజులు, హైకోర్టులు 210 రోజులు, ట్ర‌య‌ల్ కోర్టులు 245 రోజులు ప‌నిచేస్తున్నాయి.

First Published:  18 May 2016 9:00 PM GMT
Next Story