Telugu Global
Cinema & Entertainment

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు చిన్నారి పెళ్లికూతురు ?

తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అవికా గౌర్. చిన్నారి పెళ్లి కూతురు స్థాయి నుంచి సోలో హీరోయిన్ స్థాయికి ఎదిగింది. టాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ ఉన్నప్పటికీ… ఆమె వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియవు. అంతెందుకు.. షూటింగ్ లేని సమయాల్లో అవికా గౌర్ ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే తాజాగా అవికా గౌర్ ను ఓ ప్రదేశంలో చూసి అంతా ఆశ్చర్యపోయారు. అవును… ఆమె ఒక్కసారిగా కేన్స్ చిత్రోత్సవంలో ప్రత్యక్షమైంది. […]

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు చిన్నారి పెళ్లికూతురు ?
X

తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అవికా గౌర్. చిన్నారి పెళ్లి కూతురు స్థాయి నుంచి సోలో హీరోయిన్ స్థాయికి ఎదిగింది. టాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ ఉన్నప్పటికీ… ఆమె వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియవు. అంతెందుకు.. షూటింగ్ లేని సమయాల్లో అవికా గౌర్ ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే తాజాగా అవికా గౌర్ ను ఓ ప్రదేశంలో చూసి అంతా ఆశ్చర్యపోయారు. అవును… ఆమె ఒక్కసారిగా కేన్స్ చిత్రోత్సవంలో ప్రత్యక్షమైంది. ఓవైపు ఐశ్వర్యరాయ్ ఎర్రతివాచీపై తన సోయగాలతో మంటలు రేపుతుంటే… మరోవైపు సోనమ్ కపూర్ కూడా స్లిమ్ అందాలతో పిచ్చెక్కిస్తుంటే… అవికా గౌర్ మాత్రం సైలెంట్ గా కేన్స్ లో ల్యాండ్ అయి తెరవెనక వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే… ఆంఖే బాతే అనే షార్ట్ ఫిలింను కేన్స్ చిత్రోత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టారు. ఈ షార్ట్ ఫిలిం జ్యూరీకి ఎంపికవ్వలేదు. కేవలం సొంత ఖర్చులో అక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిం ప్రమోషన్ కోసమే అవికా గౌర్ కేన్స్ లో ల్యాండ్ అయింది. అయితే ఈ షార్ట్ ఫిలింకి అవికా గౌర్ కు సంబంధం ఏంటనే ప్రశ్న రావొచ్చు. ఇందులో ఆమె నటించలేదు. కానీ ఈ షార్ట్ ఫిలింకి అవికా గౌర్ క్రియేటివ్ డైరక్టర్ గా పనిచేసింది. అందుకే కేన్స్ లో వాలిపోయింది.

First Published:  19 May 2016 12:12 AM GMT
Next Story