Telugu Global
CRIME

అడ‌విలో సూట్‌కేసులో అమ్మాయి శ‌వం!

సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసుని త‌ల‌పిస్తూ అలాంటిదే మ‌రొక కేసు వెలుగులోకి వ‌చ్చింది. మ‌హారాష్ట్ర‌లోని ద‌హ‌ను తాలూకాకి స‌మీపంలో ఉన్న అడ‌వుల్లో గుర్తుతెలియ‌ని యువ‌తి శ‌వాన్ని సూట్‌కేసులో కుక్కి కాల్చివేయ‌టం పోలీసులు క‌నుగొన్నారు. బుధ‌వారం తెల్ల‌వారు జామున కాలుతున్న సూట్‌కేసుని అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించ‌డంతో ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. సూట్‌కేసులో ఉన్న యువ‌తి శ‌వాన్ని డీజిల్‌తో త‌గుల‌బెట్టి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అక్క‌డ‌కు చేరేస‌రికే సూట్‌కేసు, శ‌వం కూడా కాలి […]

సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య కేసుని త‌ల‌పిస్తూ అలాంటిదే మ‌రొక కేసు వెలుగులోకి వ‌చ్చింది. మ‌హారాష్ట్ర‌లోని ద‌హ‌ను తాలూకాకి స‌మీపంలో ఉన్న అడ‌వుల్లో గుర్తుతెలియ‌ని యువ‌తి శ‌వాన్ని సూట్‌కేసులో కుక్కి కాల్చివేయ‌టం పోలీసులు క‌నుగొన్నారు. బుధ‌వారం తెల్ల‌వారు జామున కాలుతున్న సూట్‌కేసుని అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించ‌డంతో ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. సూట్‌కేసులో ఉన్న యువ‌తి శ‌వాన్ని డీజిల్‌తో త‌గుల‌బెట్టి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అక్క‌డ‌కు చేరేస‌రికే సూట్‌కేసు, శ‌వం కూడా కాలి బూడ‌ద‌య్యాయి. పోలీసులు సూట్‌కేసు, శ‌వం తాలూకూ అవ‌శేషాల‌ను సాక్ష్యం కోసం సేక‌రించారు. మిగిలిన శ‌వం భాగాల‌ను ప‌రీక్ష‌ల‌కు పంపారు. దుండ‌గులు వేరే ప్రాంతంలో ఆ అమ్మాయిని చంపి అక్క‌డికి తెచ్చి ద‌హ‌నం చేసి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. రెండుమూడు రోజుల క్రితం ముంబ‌యి, థానే, పాల్‌ఘ‌ర్ జిల్లాల్లో న‌మోదైన యువ‌తుల మిస్సింగ్ కేసులపై వారు దృష్టి సారిస్తున్నారు. 2012లో ఇదే త‌ర‌హాలో ఇంద్రాణి త‌న కుమార్తె షీనా బోరాని హ‌త్య చేయించిన సంగ‌తి తెలిసిందే.

Next Story