Telugu Global
WOMEN

ఆ మహిళలు ఎక్కువకాలం జీవిస్తారట!

మతపరమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మహిళలు ఎక్కువకాలం జీవిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారికంటే ఎక్కువ సార్లు చర్చిలు, ఆలయాలు లాంటి వాటికి వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు,  అలా చేయ‌నివారికంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టుగా హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. వీరిలో  గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గినట్టుగా గమనించారు. 16 సంవత్సరాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో మతపరమైన  ప్రార్థనా స్థలాలకు వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారిలో  మరణముప్పు 33 శాతం […]

ఆ మహిళలు ఎక్కువకాలం జీవిస్తారట!
X

మతపరమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మహిళలు ఎక్కువకాలం జీవిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారికంటే ఎక్కువ సార్లు చర్చిలు, ఆలయాలు లాంటి వాటికి వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు, అలా చేయ‌నివారికంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టుగా హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. వీరిలో గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గినట్టుగా గమనించారు. 16 సంవత్సరాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో మతపరమైన ప్రార్థనా స్థలాలకు వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారిలో మరణముప్పు 33 శాతం వరకు తగ్గటం గుర్తించారు. మధ్యవయసున్న, వృద్ధులైన మహిళలలో ప్రార్థనా స్థలాలకు వెళ్లేవారిలో గుండెవ్యాధులనుండి మరణముప్పు 27శాతం తగ్గుతుందని వీరు చెబుతున్నారు. 1996 నుండి 2012 వరకు 74, 534 మంది చర్చిని వారానికి ఎన్నిసార్లు సందర్శిస్తున్నారు…అనే విషయాన్ని పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించారు. తరచుగా మతపరమైన సేవల్లో పాల్గొంటున్నవారిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉండటం చూశారు. వారానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు ప్రార్థనా స్థలాలకు వెళ్లేవారిలో 33శాతం మరణముప్పు తగ్గినట్టుగా, వారానికి ఒకసారి వెళ్లేవారిలో 26శాతం, వారానికి ఒకసారి కంటే తక్కువగా హాజరయ్యేవారిలో 13శాతం మరణం ముప్పుతగ్గుతుందని ఈ ఫలితాలు వెల్లడించాయి. తప్పనిసరిగా మతపరమైన సేవా కార్యక్రమాలకు, మరణముప్పులో హెచ్చుతగ్గులకు సంబంధం ఉందని ఈ పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ అధ్యయనం మధ్య వయసు, వృద్ధాప్యంలో ఉన్న మహిళల మీద మాత్రమే నిర్వహించారు. మగవారిలో, చిన్నవయసు వారిలో ఎలాంటి పలితాలు వస్తాయో చూడాల్సి ఉందని ఆ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు.

First Published:  18 May 2016 1:47 AM GMT
Next Story