Telugu Global
Cinema & Entertainment

షాకింగ్... బ్రహ్మోత్సవం బెనిఫిట్ షోలు రద్దు

నిజంగా ఇది షాకింగ్ న్యూస్. ఘట్టమనేని అభిమానులు అత్యంత నిరాశకు గురైన రోజు. బ్రహ్మోత్సవం సినిమాను ఒక రోజు ముందే చూసేద్దామని చాలామంది కలలుకన్నారు. టిక్కెట్ రేట్లు కూడా దాదాపు వెయ్యి, 1500 మధ్య ఊగిసలాడాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో… బ్రహ్మోత్సవం బెనిఫిట్ షోలు రద్దయినట్టు ఆదేశాలు అందాయి. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే.. సినిమా వసూళ్లు పెంచుకోవాలంటే బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ ఓ పెద్ద ఆయుధం. […]

షాకింగ్... బ్రహ్మోత్సవం బెనిఫిట్ షోలు రద్దు
X
నిజంగా ఇది షాకింగ్ న్యూస్. ఘట్టమనేని అభిమానులు అత్యంత నిరాశకు గురైన రోజు. బ్రహ్మోత్సవం సినిమాను ఒక రోజు ముందే చూసేద్దామని చాలామంది కలలుకన్నారు. టిక్కెట్ రేట్లు కూడా దాదాపు వెయ్యి, 1500 మధ్య ఊగిసలాడాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో… బ్రహ్మోత్సవం బెనిఫిట్ షోలు రద్దయినట్టు ఆదేశాలు అందాయి. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఎందుకంటే.. సినిమా వసూళ్లు పెంచుకోవాలంటే బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ ఓ పెద్ద ఆయుధం. అటు ఓవర్సీస్ లో కూడా బెనిఫిట్ షోలకు రెడీ అయిపోయారు. కానీ అంతా ఆగిపోయారు. అన్ని షోలు రద్దయిపోయాయి. దీనికి కారణం వేరెవరో కాదు. స్వయంగా మహేష్ బాబే. అవును… అన్ని ఏరియాల్లో బెనిఫిట్ షోలు ఆపేయమని స్వయంగా మహేష్ ఆదేశాలు జారీచేశాడట. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. బ్రహ్మోత్సవం సినిమా పక్కా క్లాస్ మూవీ. ఎలాంటి ఫైట్లు ఉండవు.. ఐటెంసాంగ్స్ వాసనే రాదు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే సకుటుంబ సపరివార చిత్రం. కానీ బెనిఫిట్ షోస్ మాత్రం అంతా మాస్ జనాలే చూస్తారు. అలాంటి జనాలకు పక్కా క్లాస్ మూవీ చూపిస్తే… కచ్చితంగా నెగెటివ్ టాక్ వస్తుంది. అది సినిమా లాంగ్ రన్ పై ప్రభావం చూపిస్తుంది. అలాంటి టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దూరమైపోతారు. అందుకే మహేష్ ముందుగానే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Click on Image to Read:

tammana

vamshi-akhil

hero-surya

First Published:  18 May 2016 2:02 AM GMT
Next Story