Telugu Global
National

ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల హ‌త్య‌...రాజ‌కీయ పార్టీలు దుమ్మెత్తి పోసుకున్నాయి!

బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొన్ని గంట‌ల తేడాతో ఇరువురు జ‌ర్న‌లిస్టులు హ‌త్య‌కు గుర‌య్యారు. బీహార్‌లో హిందుస్థాన్ అనే హిందీ ప‌త్రిక‌లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న రాజ్‌దేవ్ రంజ‌న్‌ని శుక్ర‌వారం సాయంత్రం దుండ‌గులు కాల్చి చంపారు. సివాన్ జిల్లాలోని రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఈ హ‌త్య జరిగింది. బీహార్‌లో అధికార పార్టీ ఎమ్మెల్సీ మ‌నోర‌మాదేవి కుమారుడు, త‌న వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేశాడ‌నే ఆగ్ర‌హంతో ఒక 12వ త‌ర‌గ‌తి విద్యార్థిని కాల్చి చంపిన ఘ‌ట‌న అనంత‌రం… ఈ జ‌ర్న‌లిస్టు […]

ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల హ‌త్య‌...రాజ‌కీయ పార్టీలు దుమ్మెత్తి పోసుకున్నాయి!
X

బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొన్ని గంట‌ల తేడాతో ఇరువురు జ‌ర్న‌లిస్టులు హ‌త్య‌కు గుర‌య్యారు. బీహార్‌లో హిందుస్థాన్ అనే హిందీ ప‌త్రిక‌లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న రాజ్‌దేవ్ రంజ‌న్‌ని శుక్ర‌వారం సాయంత్రం దుండ‌గులు కాల్చి చంపారు. సివాన్ జిల్లాలోని రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఈ హ‌త్య జరిగింది. బీహార్‌లో అధికార పార్టీ ఎమ్మెల్సీ మ‌నోర‌మాదేవి కుమారుడు, త‌న వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేశాడ‌నే ఆగ్ర‌హంతో ఒక 12వ త‌ర‌గ‌తి విద్యార్థిని కాల్చి చంపిన ఘ‌ట‌న అనంత‌రం… ఈ జ‌ర్న‌లిస్టు హ‌త్య జ‌రిగింది.

గురువారం రాత్రి జార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఇంద్ర‌దేవ్ యాద‌వ్ అనే జ‌ర్న‌లిస్టుని కాల్చి చంపారు. మోట‌ర్‌సైకిళ్ల‌మీద వ‌చ్చిన దుండ‌గులు ఇంద్ర‌దేవ్ యాద‌వ్‌ని చుట్టుముట్టి చాలా ద‌గ్గ‌ర నుండి ఐదురౌండ్ల కాల్పులు జ‌రిపారు. యాద‌వ్ ఒక స్థానిక టివి ఛాన‌ల్‌లో రిపోర్ట‌రుగా ప‌నిచేస్తున్నాడు. అత‌ను డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండ‌గా ఈ హ‌త్య జ‌రిగింది. ఈ రెండు హ‌త్యల విష‌యంలోనూ ఆయా రాష్ట్రాల ప్ర‌తిప‌క్షాలు, అధికార పార్టీల‌ను త‌ప్పుప‌ట్టాయి. బీహార్లో జ‌రిగిన హ‌త్య విష‌యంలో అక్క‌డ ప్ర‌తిప‌క్షంగా ఉన్న బిజెపి పార్టీ, ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌ని తీవ్రంగా విమ‌ర్శించింది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా నాశ‌నం అయ్యాయ‌ని, ప్ర‌జ‌లు వ‌ల‌స‌లు పోతున్నార‌ని, ఆట‌విక రాజ్యం న‌డుస్తోంద‌ని విమ‌ర్శ‌లు చేసింది. ఇక జార్ఖండ్‌లో ఉన్న‌ది బిజెపి పాల‌న కావ‌డంతో రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ బిజెపిపై విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు. జార్ఖండ్‌లో ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి శుక్ర‌వారం వెళ్లిన లాలూ, మ‌ర‌ణించిన యాద‌వ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. బిజెపి పాల‌న‌లో శాంతి భ‌ద్ర‌త‌లు అనేవి అస‌లు క‌నిపించ‌డం లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. మొత్తానికి ఈ రెండు సంఘ‌ట‌న‌లు… ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్ర‌తికా స్వేచ్ఛ, ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్షణ క‌రువేన‌ని వెల్ల‌డిస్తున్నాయి.

First Published:  13 May 2016 10:08 PM GMT
Next Story