Telugu Global
Cinema & Entertainment

రెజినాను  వ‌దిలి  ..నందితకు ఓటేసిన డైరెక్ట‌ర్..!

ఇండ‌స్ట్రీలో ఎవ‌రిని ఎప్పూడు ఏ అవ‌కాశం  వ‌రిస్తుందో   చెప్ప‌లేం.   ఒక్క మంచి ఆఫ‌ర్ త‌గలి  హిట్ కొడితే.. ఆర్టిస్ట్ ల జాత‌కాలు మారిపోతాయి.  ముఖ్యంగా  కృష్ణ‌వంశి లాంటి  ద‌ర్శ‌కుడి  చిత్రం చేస్తే.. ఆర్టిస్ట్  టాలెంట్ ఏంటో తెలుస్తుంద‌నే ఒక నమ్మ‌కం  వుంటుంది.  అంత‌గా వారిని పిండి మ‌రి  అవుటు పుట్  తీసుకుంటార‌ని  చెప్పుకుంటారు. ఇక హీరోయిన్స్ విష‌యంలో అయితే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సాంగ్స్  లో వారి అందాల్ని ఎలివేట్ చేయ‌డంలో  త‌న  గురువు రామ్ గోపాల్ వ‌ర్మ […]

రెజినాను  వ‌దిలి  ..నందితకు ఓటేసిన డైరెక్ట‌ర్..!
X

ఇండ‌స్ట్రీలో ఎవ‌రిని ఎప్పూడు ఏ అవ‌కాశం వ‌రిస్తుందో చెప్ప‌లేం. ఒక్క మంచి ఆఫ‌ర్ త‌గలి హిట్ కొడితే.. ఆర్టిస్ట్ ల జాత‌కాలు మారిపోతాయి. ముఖ్యంగా కృష్ణ‌వంశి లాంటి ద‌ర్శ‌కుడి చిత్రం చేస్తే.. ఆర్టిస్ట్ టాలెంట్ ఏంటో తెలుస్తుంద‌నే ఒక నమ్మ‌కం వుంటుంది. అంత‌గా వారిని పిండి మ‌రి అవుటు పుట్ తీసుకుంటార‌ని చెప్పుకుంటారు. ఇక హీరోయిన్స్ విష‌యంలో అయితే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సాంగ్స్ లో వారి అందాల్ని ఎలివేట్ చేయ‌డంలో త‌న గురువు రామ్ గోపాల్ వ‌ర్మ తో పోటీ ప‌డ‌తారు. అందుకే ఈ మ‌ధ్య రెజినా .. కృష్ణ‌వంశీ చిత్రంలో ఫ్రీగా అయిన న‌టించ‌డానికి ముందుకొచ్చిన‌ట్లు టాక్ వినిపించింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం..సందీప్ కిష‌న్ తో చేస్తున్న నక్ష‌త్రం చిత్రం లో హీరోయిన్ ఆఫ‌ర్ నందిత‌కు ద‌క్కిన‌ట్లు తెలుస్తుంది. ఇదే నిజ‌మైతే.. రెజినాకు నిరాశ త‌ప్ప‌దు . త‌ను రెమ్యునరేష‌న్ త‌గ్గించుకుని మినిమ‌మ్ ఇచ్చినా యాక్ట్ చేయ‌డానికి సిద్దంగా వున్న‌ప్ప‌టికీ… రెజినాను ఎంచుకోలేదంటే.. క‌థ కు నందిత లాంటి అమ్మాయి అయితేనే బావుంటుంద‌ని డిసైడ్ అయిన‌ట్లున్నాడు డైరెక్ట‌ర్. నందితే ఫైన‌ల్ అయిన‌ట్లు అధికారికంగా ఏ ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌ప్ప‌టికి.. ఆమే ఫైన‌ల్ కావోచ్చ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తుంది మ‌రి.

First Published:  14 May 2016 3:19 AM GMT
Next Story