జీతమడిగితే కోడిపిల్లలిచ్చారు!
ఉజ్బెకిస్తాన్‌లోని నుకుస్ అనే నగరంలో టీచర్లకు జీతంగా డబ్బుకి బదులు కోడిపిల్లలను ఇచ్చారు. ఇక్కడనుండి ప్రసారమవుతున్న అమెరికాకు చెందిన రేడియో ఒజాల్డిక్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ రేడియోతో మాట్లాడిన ఒక టీచరు…ఇది ఎంతో సిగ్గు చేటని పేర్కొన్నారు. గత సంవత్సరం జీతంగా బంగాళదుంపలు, క్యారట్లు, గుమ్మడికాయలు ఇచ్చారు. ఈ ఏడాది జీతమడిగితే అప్పుడే పుట్టిన కోడిపిల్లలను తెచ్చి తీసుకోమని బలవంతపెడుతున్నారని ఆ టీచరు వాపోయారు. మాకు కావాలంటే కోళ్లను ఇంతకంటే చౌకగా మార్కెట్లో కొనుక్కుంటాం […]
ఉజ్బెకిస్తాన్‌లోని నుకుస్ అనే నగరంలో టీచర్లకు జీతంగా డబ్బుకి బదులు కోడిపిల్లలను ఇచ్చారు. ఇక్కడనుండి ప్రసారమవుతున్న అమెరికాకు చెందిన రేడియో ఒజాల్డిక్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ రేడియోతో మాట్లాడిన ఒక టీచరు…ఇది ఎంతో సిగ్గు చేటని పేర్కొన్నారు. గత సంవత్సరం జీతంగా బంగాళదుంపలు, క్యారట్లు, గుమ్మడికాయలు ఇచ్చారు. ఈ ఏడాది జీతమడిగితే అప్పుడే పుట్టిన కోడిపిల్లలను తెచ్చి తీసుకోమని బలవంతపెడుతున్నారని ఆ టీచరు వాపోయారు. మాకు కావాలంటే కోళ్లను ఇంతకంటే చౌకగా మార్కెట్లో కొనుక్కుంటాం కదా…అంటూ ఆ టీచరు నిరసన వ్యక్తం చేశాడు. ఒక్కో కోడిపిల్లని ఏడువేల సమ్స్‌గా (రెండున్నర డాలర్లు)గా లెక్కవేస్తున్నారని, స్థానిక మార్కెట్ ధరకు రెండింతలు ఎక్కువ లెక్కవేస్తున్నారని మరో టీచరు వెల్లడించారు. అయితే ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవటంతోనే ఇలా సరిపెడుతోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయం బయటకు పొక్కకుండా ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. స్థానిక మీడియామీద తీవ్రమైన ఆంక్షలు విధించింది. విదేశీ మీడియా సంస్థలకు ఈ విషయాలను వెల్లడించేవారు తమ పేరు వివరాలు చెప్పకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇప్పుడీ వార్త బిబిసిలోనే వచ్చింది…ఇక ప్రపంచం మొత్తానికి అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోయింది.