Telugu Global
NEWS

అరెస్టుకు సిద్ధమైన కావలి ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ టీడీపీ లీకు పత్రిక కథనం రాసింది. ఈనెల 18న చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతార‌ని వెల్ల‌డించింది. మంత్రి నారాయ‌ణ‌, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌ని ఆ క‌థ‌నంలో పేర్కొంది. అంతటితో ఆగకుండా ఆ పత్రికకే చెందిన ఛానల్ లో ఈరోజు ఉదయం నుంచి స్ర్కోలింగ్స్ కూడా ప్రారంభించారు. ఈ వార్తలపై ప్ర‌తాప్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. త‌న‌పై ఎల్లో […]

అరెస్టుకు సిద్ధమైన కావలి ఎమ్మెల్యే
X

నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ టీడీపీ లీకు పత్రిక కథనం రాసింది. ఈనెల 18న చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతార‌ని వెల్ల‌డించింది. మంత్రి నారాయ‌ణ‌, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌ని ఆ క‌థ‌నంలో పేర్కొంది. అంతటితో ఆగకుండా ఆ పత్రికకే చెందిన ఛానల్ లో ఈరోజు ఉదయం నుంచి స్ర్కోలింగ్స్ కూడా ప్రారంభించారు.

ఈ వార్తలపై ప్ర‌తాప్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. త‌న‌పై ఎల్లో మీడియా దుష్ర్ప‌చారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. తాను టీడీపీలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చేర‌బోన‌ని ప్ర‌క‌టించారు. తాను జగనన్న వెంటే ఉంటానని స్పష్టం చేశారు. పచ్చ పార్టీ ప్రలోభాలకు తాను లొంగేది లేదని, అవాస్తవాలను ప్రసారం చేయటం తగదని అన్నారు.

చాలా నెలల నుంచి కావలి ఎమ్మెల్యే టీడీపీలో చేరుతారని తెలుగుదేశం మౌత్ పబ్లిసిటీ వింగ్ ప్రచారం చేస్తూనే వుంది. చాలామంది నమ్ముతున్నారు కూడా. కారణం ఏమిటంటే గత ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు ఓటర్లకు చీప్ లిక్కర్ పంచాయి. కావలి నియోజకవర్గ పరిధిలో కూడా ఈ చీప్ లిక్కర్ పంపకాలు బాగానే జరిగాయి. తాగి కొందరు ఆసుపత్రుల పాలయ్యారు. ఒకటి రెండు మరణాలు సంభవించాయి.

కేసులు దర్యాప్తులో వుండగానే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదుచేశారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని మొదటినుంచి టీడీపీ ప్రతాప్ ను దారికితెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనేవుంది. కావలి ఎమ్మెల్యే కూడా లౌక్యంగా టీడీపీ నాయకులతో చాలా మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వల్లే జీవితంలో ఆర్ధికంగా వూహించనంత ఎత్తుకు ఎదిగిన ప్రతాప్ అధికార టీడీపీ నాయకులతో కలిసి అమరావతి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినట్టు సమాచారం. వీటన్నిటి నేపధ్యంలో కావలి ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్లినా కావలి ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు.

అయితే ప్రతాప్ కు అత్యంత సన్నిహితులు చెబుతున్న విషయం ఏమిటంటే ప్రతాప్ జగన్ తో కలిసి బెంగుళూరులో కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడుపుతున్నాడని, జగన్ కి అత్యంత నమ్మకస్తుడని అందువల్ల పార్టీ మారడని అంటున్నారు. కావలిలో ప్రతాప్ ను గెలిపించిన బంధుమిత్రులు, ఒక సామాజిక వర్గం ఆయన పార్టీమారితే వూరుకోబోదని చెబుతున్నారు. ఒక వేళ పార్టీ మారితే ప్రతాప్ పరిస్థితి కావలిలో చాలా దుర్బరంగా వుంటుందంటున్నారు. కాబట్టి ఆయన పార్టీ మారే ప్రసక్తే వుండదని అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో ప్రతాప్ కు వెన్నుదన్నుగా నిలిచి ఎన్నికల్లో సహాయపడ్డ మిత్రులు పత్రికల్లో వస్తున్న కథనాలను ఆయన దృష్టికి తీసుకువస్తే “టీడీపీనుంచి బెదిరింపులు వస్తున్నాయి. పార్టీలో చేరితే మూడువందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తామంటున్నారు. చేరకపోతే చీప్ లిక్కర్ కేసును తెరమీదకు తెస్తామంటున్నారు. జైలుకు పంపిస్తామంటూ బెదిరిస్తున్నారు. జైలుకైనా వెళ్తానుగానీ టీడీపీలో చేరను. నన్ను నమ్మండి” అని మిత్రులవద్ద వాపోతున్నాడు.

Click on Image to Read:

CNN

ttdp

sangeeta-chatterjee

heritage1

venumadhav1

renu-desai

uttarakand

snake-gang

amaravathi1

ttdp

vijayawada

There-are-no-widows-in-this

chalasani

First Published:  11 May 2016 12:49 AM GMT
Next Story