Telugu Global
NEWS

రాయ‌ల‌సీమ‌లో భారీ కుంభ‌కోణం- సీఎన్ఎన్ క‌థ‌నం

విజ‌య‌వాడ నుంచి నడుస్తున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ మెడిక‌ల్ కౌన్సిలింగ్‌లో జ‌రిగిన అక్ర‌మాల విష‌యంపై ఇక్క‌డి అన్ని మీడియా సంస్థ‌లు నిద్రపోతున్నట్లు న‌టిస్తున్నా… జాతీయ మీడియా మాత్రం కూపీ లాగుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీలో జ‌రిగిన భారీ కుంభ‌కోణంపై సీఎన్ఎన్- నెట్‌వ‌ర్క్ 18 ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. కొంద‌రు పెద్ద‌లు గ‌ద్ద‌లుగా మారి ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు అందాల్సిన సీట్ల‌ను త‌న్నుకుపోయిన అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. మంత్రి నారాయ‌ణకు చెందిన మెడిక‌ల్ కాలేజ్ ప్ర‌స్తావ‌న కూడా క‌థ‌నంలో వ‌చ్చింది. […]

రాయ‌ల‌సీమ‌లో భారీ కుంభ‌కోణం- సీఎన్ఎన్ క‌థ‌నం
X

విజ‌య‌వాడ నుంచి నడుస్తున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ మెడిక‌ల్ కౌన్సిలింగ్‌లో జ‌రిగిన అక్ర‌మాల విష‌యంపై ఇక్క‌డి అన్ని మీడియా సంస్థ‌లు నిద్రపోతున్నట్లు న‌టిస్తున్నా… జాతీయ మీడియా మాత్రం కూపీ లాగుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీలో జ‌రిగిన భారీ కుంభ‌కోణంపై సీఎన్ఎన్- నెట్‌వ‌ర్క్ 18 ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. కొంద‌రు పెద్ద‌లు గ‌ద్ద‌లుగా మారి ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు అందాల్సిన సీట్ల‌ను త‌న్నుకుపోయిన అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. మంత్రి నారాయ‌ణకు చెందిన మెడిక‌ల్ కాలేజ్ ప్ర‌స్తావ‌న కూడా క‌థ‌నంలో వ‌చ్చింది. వంద కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ ప్రాంతంలోని మెడికల్ కాలేజీల్లో ఈ కుంభ‌కోణం జ‌రిగింది. రాయ‌ల‌సీమ వారికి ద‌క్కాల్సిన సీట్ల‌ను స్థానికేత‌రుల‌కు అమ్ముకున్న సంగ‌తి ఆర్టీఐ ద్వారా కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విధుప్రియ అనే అమ్మాయి మంచి ర్యాంకు సాధించింది. తిరుప‌తి ప‌ద్మావ‌తి మెడికల్ కాలేజ్ నుంచి కౌన్సిలింగ్ లెట‌ర్ కూడా వ‌చ్చింది. కోటి ఆశ‌ల‌తో విధుప్రియ అక్క‌డికి వెళ్ల‌గా గంట‌లోనే ఆమె జీవితాన్ని అధికారులు తారుమారు చేశారు. కౌన్సిలింగ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే సాంకేతిక కారణాలు చూపించి గంట పాటు కౌన్సిలింగ్ నిలిపివేశార‌ని విధుప్రియ చెప్పారు. తిరిగి కౌన్సిలింగ్ ప్రారంభం కాగానే సీట్లు భ‌ర్తీ అయిపోయిన‌ట్టుగా ప్ర‌క‌టించార‌ని విధుప్రియ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.అప్ప‌టి వ‌ర‌కు చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయ‌ని కానీ గంట‌లోనే అవి ఎలా మాయ‌మ‌వుతాయ‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. మంచి ధ‌ర‌కు సీట్లు అమ్ముకున్నార‌ని ఆరోపించారు.

సాయిశ్రీది కూడా ఇలాంటి ఉదంత‌మే. మంచి ర్యాంకు రావ‌డంతో క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో సీటుఖాయ‌మ‌నుకున్నారు. ఈ కాలేజ్లో కూడా గ‌ద్ద‌లు వాలేసి సీట్ల‌ను త‌న్నుకుపోయాయి. సాయిశ్రీకి ఆవేద‌న నిస్స‌హాయ‌త మాత్ర‌మే మిగిలాయి. కుట్ర‌లో భాగంగా సీట్ల‌ను అధికారులు బ్లాక్ చేసి ఒక్కోసీటును రూ. 80 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల‌కు అమ్ముకున్న‌ట్టు భావిస్తున్నారు. దాదాపు వంద సీట్ల‌ను ఇలా మాయం చేసేశారు. ప‌ది మెడిక‌ల్ కాలేజీల్లో ఈ కుంభ‌కోణం న‌డిచింది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు దారి తీసింది.

సీట్ల అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీఎన్ఎన్ మీడియా బృందం క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజ్ యాజ‌మాన్యాన్ని సంప్ర‌దించ‌గా … కౌన్సిలింగ్లో త‌మ ప్ర‌మేయం లేద‌ని చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ నుంచే నేరుగా ప్రొసెస్ కొన‌సాగింద‌ని కాలేజ్ వైస్ ప్రిన్సిప‌ల్ ప్రభాక‌ర్ చెప్పారు. సీట్ల కేటాయింపులో త‌మ ప్ర‌మేయం లేద‌ని చెప్పారు.

ఆర్టీఐ కార్య‌క‌ర్త ర‌మ‌ణ పిటిష‌న్ ద్వారా చాలా వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వానికి, సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఎంసీఐ కూడా ఆరా తీస్తోంది. ఆర్టీఐ కార్య‌క‌ర్త‌ల‌కు ఎంసీఐ నుంచి లేఖ కూడా అందింది. ప్రైవేట్ కాలేజీల యాజ‌మాన్యాలు కుమ్మ‌కయ్యాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మంత్రి నారాయ‌ణ‌కు కూడా మెడిక‌ల్ కాలేజ్ ఉన్న విష‌యాన్ని సీఎన్ఎన్ ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది. ఈ కుంభ‌కోణం బ‌య‌ట ప‌డితే ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌ల బండారం కూడా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. దీంతో కుంభ‌కోణాన్ని తొక్కిపెట్టేందుకు పైరవీలు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

rami-reddy-pratap-kumar-red

ttdp

sangeeta-chatterjee

heritage1

venumadhav1

renu-desai

uttarakand

snake-gang

amaravathi1

ttdp

vijayawada

There-are-no-widows-in-this

chalasani

First Published:  11 May 2016 12:22 AM GMT
Next Story