Telugu Global
National

బెదిరింపు లేఖ‌తో...రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం ర‌ద్దు!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుదుచ్చేరి వ‌చ్చి ఎన్నిక‌ల స‌భ‌లో పాల్గొంటే ముక్కలు చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మాజీ కేంద్రమంత్రి వి.నారాయణస్వామికి లేఖ రాసిన నేప‌థ్యంలో రాహూల్ గాంధీ మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన‌ పుదుచ్చేరి ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకున్నారు.  త‌న‌కు ఆదివారం నుండి తీవ్ర‌మైన జ్వ‌రం రావ‌టం వ‌ల‌న ముందుగా అనుకున్న‌ట్టుగా పుదుచ్చేరి రాలేక‌పోతున్నాన‌ని,  వైద్యులు రెండురోజులు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించార‌ని ఆయ‌న ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. రాహుల్ పుదుచ్చేరితో పాటు త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో కూడా […]

బెదిరింపు లేఖ‌తో...రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం ర‌ద్దు!
X

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుదుచ్చేరి వ‌చ్చి ఎన్నిక‌ల స‌భ‌లో పాల్గొంటే ముక్కలు చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మాజీ కేంద్రమంత్రి వి.నారాయణస్వామికి లేఖ రాసిన నేప‌థ్యంలో రాహూల్ గాంధీ మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన‌ పుదుచ్చేరి ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకున్నారు. త‌న‌కు ఆదివారం నుండి తీవ్ర‌మైన జ్వ‌రం రావ‌టం వ‌ల‌న ముందుగా అనుకున్న‌ట్టుగా పుదుచ్చేరి రాలేక‌పోతున్నాన‌ని, వైద్యులు రెండురోజులు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించార‌ని ఆయ‌న ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. రాహుల్ పుదుచ్చేరితో పాటు త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో కూడా ప‌ర్య‌టించాల్సి ఉండ‌గా ఆ కార్య‌క్ర‌మాలు సైతం ర‌ద్ద‌య్యాయి. త‌న త‌దుప‌రి ప‌ర్య‌ట‌న ఎప్పుడు ఉంటుందో తెలియ‌జేస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఈ నెల 14తో ముగించాల్సి ఉంది. బెదిరింపు లేఖ వ‌చ్చిన త‌రువాత కాంగ్రెస్ నేత‌లు హోం మంత్రిని క‌లిసి రాహుల్ గాంధీకి అద‌న‌పు సెక్యురిటీ ఇవ్వాల్సిందిగా కోరారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాహుల్ భ‌ద్ర‌త‌కు ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ద‌ళ‌ క‌మేండోల‌ను మ‌రింత ఎక్కువ సంఖ్య‌లో త‌ర‌లించాల‌ని, నిఘా వ‌ర్గాల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అయినా రాహుల్ త‌న పర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.

First Published:  9 May 2016 10:08 PM GMT
Next Story