Telugu Global
Cinema & Entertainment

సైలెంట్ గా సినిమా స్టార్ట్ చేసిన రానా

బాహుబలి-2కు సెలవులు ఇచ్చారు. 45 రోజుల పాటు ఎలాంటి షూటింగ్ లు లేవు. దీంతో యూనిట్ సభ్యులంతా ఎంజాయ్ మెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కానీ రానా మాత్రం కామ్ గా మరో సినిమాను ప్రారంభించాడు. తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేస్తాడనే వార్త ఈమధ్యే హెడ్ లైన్స్ లోకి వచ్చింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే రానా మాత్రం ఏకంగా తేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లిపోయాడు. కొత్త […]

సైలెంట్ గా సినిమా స్టార్ట్ చేసిన రానా
X
బాహుబలి-2కు సెలవులు ఇచ్చారు. 45 రోజుల పాటు ఎలాంటి షూటింగ్ లు లేవు. దీంతో యూనిట్ సభ్యులంతా ఎంజాయ్ మెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కానీ రానా మాత్రం కామ్ గా మరో సినిమాను ప్రారంభించాడు. తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేస్తాడనే వార్త ఈమధ్యే హెడ్ లైన్స్ లోకి వచ్చింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే రానా మాత్రం ఏకంగా తేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లిపోయాడు. కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. శరవేగంగా సినిమాలు తీసే తేజ…. ఈ 45 రోజుల్లోనే రానాతో సినిమా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట. మరోవైపు ఈ సినిమాలో రానా సరసన తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాజల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే తేజ. లక్ష్మీకల్యాణం సినిమాతో దాదాపు 9ఏళ్ల కిందట పరిశ్రమకొచ్చిన కాజల్… మళ్లీ ఇన్నేళ్లకు తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం రానా-కమెడీయన్ ప్రవీణ్ మధ్య కామెడీ సన్నివేశాలు తెరకెక్కించారు. మరోవైపు రానా-కాజల్ తో ఓ ఫొటో షూట్ కూడా చేశారు. అంతా బాగానే ఉంది కానీ… ఇంత సైలెంట్ గా సినిమాను స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది పెద్ద ప్రశ్న.
First Published:  10 May 2016 2:25 AM GMT
Next Story