Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి కథతో వెంకటేశ్ సినిమా...

ఇప్పటికే ఎంతోమంది హీరోలను డైరక్ట్ చేసిన పూరి జగన్నాధ్.. వెంకటేష్ తో మాత్రం ఇన్నేళ్లయినా సినిమా చేయలేకపోయాడు. ఇన్నేళ్లకు ఆ కోరిక నెరవేరబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాను పూరి జగన్నాధ్ చేతిలో పెట్టాడట వెంకటేశ్. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే పూరి-వెంకీ కాంబో తెరపైకి వస్తుంది. అన్నట్టు చిరంజీవి కోసం రాసుకున్న ఆటో జానీ కథనే… వెంకీ 75వ సినిమాగా తెరకెక్కించాలని పూరి జగన్నాధ్ అనుకుంటున్నాడట. గతంలో చిరంజీవి 150వ సినిమా కోసం […]

చిరంజీవి కథతో వెంకటేశ్ సినిమా...
X
ఇప్పటికే ఎంతోమంది హీరోలను డైరక్ట్ చేసిన పూరి జగన్నాధ్.. వెంకటేష్ తో మాత్రం ఇన్నేళ్లయినా సినిమా చేయలేకపోయాడు. ఇన్నేళ్లకు ఆ కోరిక నెరవేరబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాను పూరి జగన్నాధ్ చేతిలో పెట్టాడట వెంకటేశ్. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే పూరి-వెంకీ కాంబో తెరపైకి వస్తుంది. అన్నట్టు చిరంజీవి కోసం రాసుకున్న ఆటో జానీ కథనే… వెంకీ 75వ సినిమాగా తెరకెక్కించాలని పూరి జగన్నాధ్ అనుకుంటున్నాడట. గతంలో చిరంజీవి 150వ సినిమా కోసం ఆటోజానీ కథ రాసుకున్నాడు వెంకీ. ఫస్టాఫ్ బాగుందని చిరంజీవి కూడా మెచ్చుకున్నాడు. కానీ సడెన్ గా ఆ ప్రాజెక్టు నుంచి పూరి సైడైపోయాడు. ఇప్పుడదే కథను టైటిల్ మార్చి వెంకీకి వినిపించాడట. వెంకటేష్ కు కూడా కథ బాగా నచ్చినట్టు తెలుస్తోంది. కుదిరితే తన 75వ సినిమాగా చిరంజీవి తిరస్కరించిన ఆటోజానీ కథనే తెరకెక్కించాలని వెంకీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి డైలాగ్ వెర్షన్ కూడా పూరి జగన్నాధ్ పూర్తిచేశాడు. ఆ డైలాగులు వెంకీకి చాలా బాగా నచ్చాయట. త్వరలోనే దీనిపై అ క్లారిటీ రానుంది.
First Published:  8 May 2016 11:31 PM GMT
Next Story