Telugu Global
WOMEN

ఆ ముగ్గురు ఆడ‌వాళ్లు...ఆ గుళ్లోకి వెళ్లారు!

ఆడవాళ్ల‌కు కొన్ని ఆల‌యాల ప్ర‌వేశాన్ని నిషేధించ‌డంపై  సుప్రీంకోర్టు తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశాక‌, దేశ‌వ్యాప్తంగా ఈ విష‌యంలో చాలామంది దృక్ప‌థంలో మార్పు వ‌స్తున్న‌ట్టే ఉంది. ఇంతకుముందు నిషేధం ఉన్న ఆల‌యాల్లోకి వెళ్లేందుకు మ‌హిళ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్ని చోట్ల నిర‌స‌న‌లూ ఎదుర్కొంటున్నారు. అయితే హిమాచ‌ల ప్ర‌దేశ్, హ‌మిర్‌పూర్ జిల్లాలో ఉన్న బాబా బాల‌క్ నాథ్ గుడి విష‌యంలో, అనుమ‌తి ఇచ్చినా మ‌హిళ‌లు ముందుకు రాని ప‌రిస్థితి ఉంది.  శ‌తాబ్దాలుగా ఈ ఆల‌యం ఉన్న గుహ‌లోనికి మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌కూడ‌ద‌నే ఆచారం ఉంది. […]

ఆ ముగ్గురు ఆడ‌వాళ్లు...ఆ గుళ్లోకి వెళ్లారు!
X

ఆడవాళ్ల‌కు కొన్ని ఆల‌యాల ప్ర‌వేశాన్ని నిషేధించ‌డంపై సుప్రీంకోర్టు తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశాక‌, దేశ‌వ్యాప్తంగా ఈ విష‌యంలో చాలామంది దృక్ప‌థంలో మార్పు వ‌స్తున్న‌ట్టే ఉంది. ఇంతకుముందు నిషేధం ఉన్న ఆల‌యాల్లోకి వెళ్లేందుకు మ‌హిళ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్ని చోట్ల నిర‌స‌న‌లూ ఎదుర్కొంటున్నారు. అయితే హిమాచ‌ల ప్ర‌దేశ్, హ‌మిర్‌పూర్ జిల్లాలో ఉన్న బాబా బాల‌క్ నాథ్ గుడి విష‌యంలో, అనుమ‌తి ఇచ్చినా మ‌హిళ‌లు ముందుకు రాని ప‌రిస్థితి ఉంది. శ‌తాబ్దాలుగా ఈ ఆల‌యం ఉన్న గుహ‌లోనికి మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌కూడ‌ద‌నే ఆచారం ఉంది.

బాబా బాలక్‌నాథ్ అంటే శివుడి ప్ర‌థ‌మ‌పుత్రుడు కార్తికేయుని అవతార‌మని, ఆయన బ్ర‌హ్మ‌చారి క‌నుక మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌కూడ‌ద‌ని న‌మ్ముతారు. అందుకే గుడి ఉన్న గుహ‌కు వెలుప‌ల కొంత దూరం నుండే ఆడ‌వాళ్లు పూజ‌లు చేస్తుంటారు. అయితే ఏప్రిల్ 16 నుండి మ‌హిళ‌లు సైతం ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌వ‌చ్చ‌ని ఆల‌య అధికారులు ప్ర‌క‌టించారు. అయినా మ‌హిళ‌లు స‌నాత‌న అచారానికి భ‌య‌ప‌డి ఆల‌యం వెలుప‌లే పూజ‌లు చేస్తున్నారు. కానీ శ‌నివారం ఒక మ‌హిళ త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో వ‌చ్చి ఆల‌య కుహ‌రంలోకి ప్ర‌వేశించి పూజ‌లు నిర్వ‌హించింది. అర్చ‌కుల స‌మ‌క్షంలోనే ఆమె పూజలు చేసింది. దీంతో మ‌రొక ఆలయ ప్ర‌వేశం విష‌యంలో మ‌హిళ‌లపై ఉన్న ఆంక్ష‌లకు చ‌ర‌మ‌గీతం పాడిన‌ట్ల‌యింది.

First Published:  9 May 2016 7:09 AM GMT
Next Story