Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ పై మ‌హేష్ సెటైర్..!

మైండ్ పొల్యూట్ కాకుండా చూసుకోవ‌డం అనేది ఎవ‌రికైన అంత తేలికైన విష‌యం కాదు. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఎన్నో మాయ‌లు..ఎన్నో మోసాలుంటాయి. అక్క‌డే వుండి.. అక్క‌డే చిత్రాలు చేసే వారికి వాటి అన్నింటికి అతీతంగా ఉండ‌టం సాధ్యం కాదు. అయితే ప్ర‌తి మ‌నిషికి వుండే స‌హ‌జ సిద్ద‌మై స్వ‌భావం .. ఎప్పుడు ఒకేలా ఉంటుంద‌ని గ్యారంటి లేదు. ప‌రిస్థిత‌ల్ని బ‌ట్టి మారే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ద‌ర్శ‌కులు అయితే ఏ హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు.. ఆ హీరోకు న‌చ్చిన […]

టాలీవుడ్ పై మ‌హేష్ సెటైర్..!
X

మైండ్ పొల్యూట్ కాకుండా చూసుకోవ‌డం అనేది ఎవ‌రికైన అంత తేలికైన విష‌యం కాదు. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఎన్నో మాయ‌లు..ఎన్నో మోసాలుంటాయి. అక్క‌డే వుండి.. అక్క‌డే చిత్రాలు చేసే వారికి వాటి అన్నింటికి అతీతంగా ఉండ‌టం సాధ్యం కాదు. అయితే ప్ర‌తి మ‌నిషికి వుండే స‌హ‌జ సిద్ద‌మై స్వ‌భావం .. ఎప్పుడు ఒకేలా ఉంటుంద‌ని గ్యారంటి లేదు. ప‌రిస్థిత‌ల్ని బ‌ట్టి మారే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ద‌ర్శ‌కులు అయితే ఏ హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు.. ఆ హీరోకు న‌చ్చిన విధంగా ఉంటూ అత‌ని ఒకే చేయించేకోవాల్సి వుంటుంది. ఈ ద‌శ‌లో ఎవ‌రి టాలెంట్ వాళ్లు చూపుతుంటారు. అది ఇండ‌స్ట్రీలో అనుభ‌వం వున్న అంద‌రికి తెలుసు.

మ‌హేష్ బాబు కు చిన్న‌ప్ప‌టి నుంచి ఫిలిం బ్యాగ్రౌండ్ ఉంది కాబ‌ట్టి..ఈ విష‌యాలు మ‌రింత‌గా అనుభ‌వంలోకి వ‌చ్చి వుంటాయి. సినిమా ఇండ‌స్ట్రీలో వున్న వాళ్లు సైకాల‌జి ఎలా వుంటుంది అనేది ఒక అవ‌గాహాన ఉంది. అదే అవ‌గాహాన‌తో బ్ర‌హ్మోత్స‌వం ఆడియో విడుద‌ల్లో ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల్ని గురించి చెబుతు ఒక మాట వ‌దిలారు. శ్రీ‌కాంత్ అంటే త‌న‌కు చాల ఇష్ట‌మ‌ని.. మైండ్ లో ఏ విధ‌మైన పొల్యూష‌న్ లేని వాడు. ఇలా ఉండ‌టానికి బహుశ ఇండ‌స్ట్రీ జ‌నాల‌తో పెద్ద‌గా క‌ల‌వ‌డ‌నుకుంటా అన్నారు. రెగ్యుల‌ర్ గా వాళ్ల‌తో క‌లిస్తే శ్రీ‌కాంత్ అడ్డాల మైండ్ కూడా చాల మంది లాగానే అయ్యేదేమో అన్న‌ట్లు చెప్పారు. సో మొత్తం మీద ఇండ‌స్ట్రీ లో జ‌న‌ర‌ల్ మైండ్ సైట్ ఒక విధ‌మైన పొల్యూష‌న్ ఉంటుంది అనేది చెప్ప‌క‌నే చెప్పారు క‌దా. ఏం చేస్తారు లెండి ఎవ‌రైనా.. స్ట్ర‌గుల్ ఫ‌ర్ ఎగ్జిస్ట‌న్స్ క‌దా.!

First Published:  8 May 2016 6:32 AM GMT
Next Story