Telugu Global
CRIME

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి!

నాలుగేళ్ల బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన ఒక డ్యాన్స్ టీచ‌ర్‌ని అరెస్టు చేసిన‌ట్టుగా బెంగ‌లూరు పోలీసులు శ‌నివారం తెలిపారు. పీట‌ర్‌(21) అనే ఆ డ్యాన్స్ టీచ‌ర్ స‌మ్మ‌ర్ క్యాంపుకి వ‌చ్చిన చిన్నారిని లైంగికంగా హింసించిన‌ట్టుగా ఆమె త‌ల్లిదండ్రులు ఆరోపించ‌డంతో పోలీసులు అత‌డిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. కోర్టు అత‌డికి జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. ఈనెల 3న స‌మ్మ‌ర్ క్యాంపుకి వెళ్లిన చిన్నారి ఇంటికి వ‌చ్చి నొప్పిగా ఉంద‌ని చెప్ప‌టంతో త‌ల్లిదండ్రులు ఆమెను డాక్ట‌రు వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది. బాలిక సైతం పీట‌ర్ […]

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి!
X

నాలుగేళ్ల బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన ఒక డ్యాన్స్ టీచ‌ర్‌ని అరెస్టు చేసిన‌ట్టుగా బెంగ‌లూరు పోలీసులు శ‌నివారం తెలిపారు. పీట‌ర్‌(21) అనే ఆ డ్యాన్స్ టీచ‌ర్ స‌మ్మ‌ర్ క్యాంపుకి వ‌చ్చిన చిన్నారిని లైంగికంగా హింసించిన‌ట్టుగా ఆమె త‌ల్లిదండ్రులు ఆరోపించ‌డంతో పోలీసులు అత‌డిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. కోర్టు అత‌డికి జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. ఈనెల 3న స‌మ్మ‌ర్ క్యాంపుకి వెళ్లిన చిన్నారి ఇంటికి వ‌చ్చి నొప్పిగా ఉంద‌ని చెప్ప‌టంతో త‌ల్లిదండ్రులు ఆమెను డాక్ట‌రు వ‌ద్ద‌కు తీసుకువెళ్ల‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది. బాలిక సైతం పీట‌ర్ పేరుని చెప్పింది. పోలీసుల ఇంట‌రాగేష‌న్‌లో పీట‌ర్ త‌న నేరాన్ని అంగీక‌రించాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  7 May 2016 9:00 PM GMT
Next Story