Telugu Global
NEWS

రెండు కార‌ణాల‌తో పార్టీ వీడుతున్నా- ఎస్వీ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌

క‌ర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. చంద్ర‌బాబు స‌మక్షంలో శ‌నివారం ఆయ‌న టీడీపీలో చేర‌నున్నారు. ఈ విష‌యాన్ని మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తాను పార్టీ వీడేందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాల‌ను ఎస్వీ మోహ‌న్ రెడ్డి చెప్పారు. ఈ నెల 16న క‌ర్నూలులో జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న దీక్ష‌పై త‌న‌కు ముందస్తు స‌మాచారం ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని అందుకే పార్టీ వీడుతున్న‌ట్టు వెల్ల‌డించారు. దీనితో పాటు ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా అఖిల ప్రియ‌కు ప్ర‌త్య‌ర్థిగా త‌న […]

రెండు కార‌ణాల‌తో పార్టీ వీడుతున్నా- ఎస్వీ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌
X

క‌ర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. చంద్ర‌బాబు స‌మక్షంలో శ‌నివారం ఆయ‌న టీడీపీలో చేర‌నున్నారు. ఈ విష‌యాన్ని మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తాను పార్టీ వీడేందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాల‌ను ఎస్వీ మోహ‌న్ రెడ్డి చెప్పారు.

ఈ నెల 16న క‌ర్నూలులో జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న దీక్ష‌పై త‌న‌కు ముందస్తు స‌మాచారం ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని అందుకే పార్టీ వీడుతున్న‌ట్టు వెల్ల‌డించారు. దీనితో పాటు ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా అఖిల ప్రియ‌కు ప్ర‌త్య‌ర్థిగా త‌న చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని రంగంలోకి దింపేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించార‌ని, అలా చేయ‌డం త‌న‌కు బాధ‌గా అనిపించింద‌ని చెప్పారు. అందుకే పార్టీ వీడుతున్నాన‌న్నారు.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ని వెల్లడించారు. అయితే మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న భూమానాగిరెడ్డిపై ముందు బావ‌మ‌రిది ఎస్వీ మోహ‌న్ రెడ్డిని టీడీపీలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు ఒత్తిడి చేసిన‌ట్టు చెబుతున్నారు. దీంతో కుటుంబ‌స‌భ్యుల ద్వారా మోహ‌న్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి టీడీపీలోకి వ‌చ్చేలా చేయ‌డంలో భూమా నాగిరెడ్డి విజ‌యం సాధించార‌ని చెబుతున్నారు.

click to read-

paritala-sriram-new

chandrababu-naidu

ap-chief-secretary-takkar

First Published:  5 May 2016 8:13 AM GMT
Next Story