Telugu Global
Cinema & Entertainment

 సోనాక్షి ఆ హీరోతో  5 వ సారి..

సిల్వ‌ర్ స్క్రీన్ పై  కొన్ని  జోడిల‌కు క్రేజ్ ఉంటుంది.  ఇక క‌మ‌ర్షియ‌ల్  ఫార్మేట్ లో   సినిమాలు చేస్తున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు   కాంబినేష‌న్ ల మీద ఉండే క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటారు.   అలా  బాలీవుడ్ లో    సోనాక్షి సిన్హా, అక్ష‌య్ కుమార్ ల జంట 5వ సారి  జ‌త క‌ట్ట‌నున్నారు.   న‌మస్టే ఇంగ్లాండ్ లో  సొనాక్షి ..అక్ష‌య్ కుమార్ స‌ర‌సన న‌టించ‌నుంది.  ఈ చిత్రంలో   నాయిక పాత్ర […]

 సోనాక్షి ఆ హీరోతో  5 వ సారి..
X
సిల్వ‌ర్ స్క్రీన్ పై కొన్ని జోడిల‌కు క్రేజ్ ఉంటుంది. ఇక క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ లో సినిమాలు చేస్తున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు కాంబినేష‌న్ ల మీద ఉండే క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటారు. అలా బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా, అక్ష‌య్ కుమార్ ల జంట 5వ సారి జ‌త క‌ట్ట‌నున్నారు. న‌మస్టే ఇంగ్లాండ్ లో సొనాక్షి ..అక్ష‌య్ కుమార్ స‌ర‌సన న‌టించ‌నుంది. ఈ చిత్రంలో నాయిక పాత్ర కోసం అనుష్క శ‌ర్మ‌, కంగ‌న పేర్లు అనుకున్నార‌ట‌. చివ‌ర‌కు సోనాక్షి ని అవ‌కాశం వ‌రించింది.
గ‌తంలో వీరిద్ద‌రు క‌ల‌సి హాలిడే .. వ‌న్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయి దోబారా.. రౌడి రాథోడ్, జోక‌ర్ చిత్రాల్లో ఈ జంట సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఈ జోడి న‌టించ బోతున్న న‌మ‌స్తే ఇంగ్లాండ్ చిత్రం 2007 లో వ‌చ్చిన న‌మ‌స్తే లండ‌న్ కు ఇది సీక్వెల్ అంటూ వార్త‌లొస్తున్నాయి. అయితే చిత్ర వ‌ర్గాలు మాత్రం ఇది ఫ్రెష్ గా రానున్న క‌థ అని చెబుతున్నారు. మొత్తం మీద సొనాక్షి, అక్ష‌య్ ల జోడి ఐదో సారి అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్దం అయ్యారు మ‌రి.
First Published:  3 May 2016 11:39 PM GMT
Next Story