Telugu Global
Cinema & Entertainment

ఒక్క ఫొటోతో అంచనాలు పైపైకి....

బాహుబలి-2 ప్రచారం అనధికారికంగా ప్రారంభమైంది. అఫీషియల్ గా డిసెంబర్ నెల నుంచి బాహుబలి-2 సినిమాకు ప్రచారం కల్పిస్తారు. కానీ ఈ లోగా సోషల్ మీడియాలో విడుదలవుతున్న ఫొటోలు సిినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫొటోనే అందుకు నిదర్శనం. స్టిల్ లో భళ్లాలదేవ, బాహుబలి పైకి శూలం ఎక్కుపెట్టాడు. దీనికి ప్రతిగా బాహుబలి కూడా కత్తితో సమరానికి సై అంటున్నట్టు ఈ స్టిల్ ఉంది. కాకపోతే ఈ సన్నివేశం సినిమాలో ఉందో లేదో ఎవరికీ తెలియదు. […]

ఒక్క ఫొటోతో అంచనాలు పైపైకి....
X
బాహుబలి-2 ప్రచారం అనధికారికంగా ప్రారంభమైంది. అఫీషియల్ గా డిసెంబర్ నెల నుంచి బాహుబలి-2 సినిమాకు ప్రచారం కల్పిస్తారు. కానీ ఈ లోగా సోషల్ మీడియాలో విడుదలవుతున్న ఫొటోలు సిినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫొటోనే అందుకు నిదర్శనం. స్టిల్ లో భళ్లాలదేవ, బాహుబలి పైకి శూలం ఎక్కుపెట్టాడు. దీనికి ప్రతిగా బాహుబలి కూడా కత్తితో సమరానికి సై అంటున్నట్టు ఈ స్టిల్ ఉంది. కాకపోతే ఈ సన్నివేశం సినిమాలో ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే… ఇది షూటింగ్ లో భాగంగా తీసిన స్టిల్ కాదు. షూటింగ్ గ్యాప్ లో సరదాగా తీసిన స్టిల్. చూడండి… రానా, ప్రభాస్ ఎలా నవ్వుతూ కనిపిస్తున్నారో. మరోవైపు ఎండల కారణంగా బాహుబలి-2 సినిమాకు సెలవులు ప్రకటించారు. దాదాపు 45 రోజులు బాహుబలి-2 షూటింగ్ నిలిపివేశారు. ఈ గ్యాప్ లో రాజమౌళి ఆస్ట్రేలియా వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం కోసమే ఇన్నాళ్లూ ఆగాడట. ఆ అవార్డు కూడా అందుకున్నాడు కాబట్టి రేపోమాపో విదేశాలకు చెక్కేయడం ఖాయం. షూటింగ్ కు సెలవులు ప్రకటించడానికి ముందుగానే… సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని రాజమౌళి ఫిలింసిటీలో చిత్రీకరించారు. అందులో భాగంగానే క్లిక్ మనిపించిన చిత్రమిది.
First Published:  4 May 2016 6:35 AM GMT
Next Story