Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సినిమాలో బీజేపీ ఎంపీ

బాలయ్య సినిమా రోజుకో సెన్సేషన్ సృష్టిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ఏ ముహూర్తాన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాను ప్రారంభించాడో కానీ అప్పట్నుంచి ఈ సినిమా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే సన్నీలియోన్ పేరు ప్రకటించి పెద్ద సంచలనమే సృష్టించారు మేకర్స్. తాజాగా ఈ సినిమా కోసం తొలిసారిగా అలనాటి మేటి నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమమాలినీని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో హేమమాలినీ కనిపించలేదు. కనీసం ఆమెను తెలుగుతెరపైకి తీసుకొద్దామనే ఆలోచన కూడా ఎవరూ […]

బాలయ్య సినిమాలో బీజేపీ ఎంపీ
X
బాలయ్య సినిమా రోజుకో సెన్సేషన్ సృష్టిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ఏ ముహూర్తాన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాను ప్రారంభించాడో కానీ అప్పట్నుంచి ఈ సినిమా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే సన్నీలియోన్ పేరు ప్రకటించి పెద్ద సంచలనమే సృష్టించారు మేకర్స్. తాజాగా ఈ సినిమా కోసం తొలిసారిగా అలనాటి మేటి నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమమాలినీని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో హేమమాలినీ కనిపించలేదు. కనీసం ఆమెను తెలుగుతెరపైకి తీసుకొద్దామనే ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. ఇన్నాళ్లకు క్రిష్ ఆ ధైర్యం చేశాడు. శాతకర్ణి స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతో హేమమాలినిని సంప్రదించి కథ వినిపించాడట. స్టోరీ విన్న హేమమాలిని సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని సమాచారం. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణకు తల్లిగా హేమమాలిని నటించనుంది. ఈనెల 9 నుంచి మొరాకోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుంది. సినిమా షూటింగ్ ప్రారంభాన్నే యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కించాలని క్రిష్ నిర్ణయించాడు. ఈ మేరకు మొరాకోలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈలోగా హీరోయిన్ ఎవరనే విషయాన్ని కన్ ఫర్మ్ చేయబోతున్నారు.
Click on Image to Read:
balakrishna
chiru-balakrishna
chiru-150-movie
Next Story