Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి కోసం కోడలు ప్రత్యేక పూజలు

ఈమధ్యే చిరంజీవి తన 150వ సినిమా ప్రారంభించారు. పరుచూరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. పవన్ కల్యాణ్ మినహా…. మెగాకాంపౌండ్ కు చెందిన హీరోలంతా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ రోజు నుంచే ప్రారంభం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో… చిరంజీవి 150వ సినిమా విజయవంతం కావాలని కోడలు ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి ప్రచార […]

చిరంజీవి కోసం కోడలు ప్రత్యేక పూజలు
X
ఈమధ్యే చిరంజీవి తన 150వ సినిమా ప్రారంభించారు. పరుచూరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. పవన్ కల్యాణ్ మినహా…. మెగాకాంపౌండ్ కు చెందిన హీరోలంతా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ రోజు నుంచే ప్రారంభం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో… చిరంజీవి 150వ సినిమా విజయవంతం కావాలని కోడలు ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా అన్నవరం చేరుకున్న ఉపాసన…. సత్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. చిరు 150వ సినిమా హిట్ అవ్వాలని మనసారా కోరుకున్నారు. ఈ పూజల అనంతరం తన కారులో అన్నవరం నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు ఉపాసన. విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఉపాసన ఇంత సడెన్ గా అన్నవరంలో ప్రత్యక్ష కావడం మెగాఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉపాసనతో పాటు భర్త రామ్ చరణ్ కూడా రావాల్సి ఉన్నప్పటికీ… ఆఖరి నిమిషంలో చెర్రీ డ్రాప్ అయ్యాడు.
First Published:  1 May 2016 10:32 PM GMT
Next Story