హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్ ?
సెలిబ్రిటీస్ లో డేటింగ్ అనేది పెద్ద విశేషం ఏమి కాదు. అయితే నటి పూనమ్ బజ్వా మాత్రం డేటింగ్ విషయంలో కొంత సీక్రసీ ని మెయింటెన్ చేస్తున్నట్లుంది. ఒక దశాబ్దం క్రితం నటిగా టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎక్కువ చిత్రాలు చేయలేక పోయినా.. నాగార్జున తో బాస్.. అల్లు అర్జున్ తో పరుగు వంటి చిత్రాలు చేసి అభిమానులకు బాగానే రీచ్ అయ్యింది. అయితే ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ తాకిడి ఎక్కువుగా వుండటంతో పూనమ్ […]
సెలిబ్రిటీస్ లో డేటింగ్ అనేది పెద్ద విశేషం ఏమి కాదు. అయితే నటి పూనమ్ బజ్వా మాత్రం డేటింగ్ విషయంలో కొంత సీక్రసీ ని మెయింటెన్ చేస్తున్నట్లుంది. ఒక దశాబ్దం క్రితం నటిగా టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎక్కువ చిత్రాలు చేయలేక పోయినా.. నాగార్జున తో బాస్.. అల్లు అర్జున్ తో పరుగు వంటి చిత్రాలు చేసి అభిమానులకు బాగానే రీచ్ అయ్యింది. అయితే ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ తాకిడి ఎక్కువుగా వుండటంతో పూనమ్ లాంటి వారికి ఆఫర్స్ పెద్దగా రావడం లేదనే చెప్పాలి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు చెందిన సునిల్ రెడ్డి అనే దర్శకుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు సోషల్ నెట్ వర్క్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. మరి ప్రస్తుతం వీరి పెళ్లి ఎంత వరకు నిజమో తెలియాల్సి వుంది. అయితే వీరి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది టాపిక్. ఈ విషయమై ఇటు డైరెక్టర్.. అటు హీరోయిన్ క్లారిటీ ఇచ్చేవరకు నమ్మడం కష్టమనే చెబుతున్నారు కొందరు.